Home Remedies For Hair Fall: జుట్టు మన అందానికి చాలా ముఖ్యమైనది. ఎంత జాగ్రత్తగా చూసుకున్నా కొంత జుట్టు ఊడిపోవడం సహజం. అయితే కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా జుట్టు ఊడిపోవడాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చు. దీని వల్ల మీ జుట్టు ఆరోగ్యంగా, ఒత్తుగా ఉంటుంది. జుట్టు ఊడకుండా ఉండటానికి ఎలాంటి చిట్కాలు పాటించాలి అనేది మనం తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చిట్కాలు:


జుట్టు బలంగా, దృఢంగా ఉంచడంలో ఉసిరికాయ నూనె ఎంతో మేలు చేస్తుంది. దీని ఎలా ఉపయోగించాలి అంటే ముందుగా మీరు ఎండబెట్టిన ఉసిరికాయలను తీసుకోవాలి అలాగే కొబ్బరి నూనెలో వేడి చేసి రాత్రంతా నానబెట్టాలి. ఆ మరుసటి రోజు నూనెను వడగట్టి తలకు రాసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల జుట్టు ఊడటం తగ్గుతుంది. ఇలా వారంలో ఒకసారి అయిన దీని ఉపయోగించాల్సి ఉంటుంది. దీంతో పాటు మరో అద్భుతమైన నూనె ఒకటి ఉంది. అదే కొబ్బరి నూనె, నిమ్మరసం. ఈ రెండు జుట్టు సంరక్షణలో ఎంతో మేలు చేస్తాయి. కొబ్బరి నూనెలో కొద్దిగా నిమ్మరసం కలిపి తలకు పట్టించాలి. ఇలా చేయడం వల్ల జుట్టుకు మంచి నిగారింపు వస్తుంది. అంతేకాకుండా జుట్టు ఊడకుండా ఉంటుంది. కాబట్టి దీని ఉపయోగించడం వల్ల మీరు ఆరోగ్యకరమైన కురులను సొంతం చేసుకోవచ్చు. 


కొత్తిమీర జ్యూస్‌ జుట్టు సమరక్షణలో ఎంతో మేలు చేస్తుంది. దీని రసంగా తీసుకోవాలి. ఆ తరువాత తలకు పట్టించి అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఇది జుట్టు ఊడటాన్ని నివారిస్తుంది. కొత్తిమీరలో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. ఈ పోషకాలు మీ జుట్టుకు ఎంతో సహాయపడుతాయి. అలాగే జుట్టు ఆరోగ్యంగా ఉండాలి అంటే నిమ్మకాయ గింజలు, మిరియాలను ముద్దగా తయారు చేసుకోవాలి. వీటిని తలకు పట్టించి బాగా అరిచి తలస్నానం తయాలి. ఇలా చేయడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు. వీటితో పాటు మీరు పెసలు, మెంతులను కూడా ఉపయోగించవచ్చు. ముందుగా పెసలను ఉడికించి ముద్దగా తయారు చేసుకొని మెంతుల పొడిని ఇందులోకి కలుపుకోవాలి. ఆ తరువాత ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి ఆరిన తర్వాత తలస్నానం చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల అందమైన, పొడవైన జుట్టు మీ సొంతం అవుతుంది. 


జుట్టును ఒత్తుగా చేయడంలో పెరుగు, మిరియాల పొడి ఎంతో సహాయపడుతుంది. దీని కోసం మీరు వంద గ్రాముల పెరుగులో ఒక గ్రాము మిరియాల పొడిని కలుపుకోవాలి. దీని తలకు బాగా అప్లై చేసి ఆరిన తర్వాత స్నానం చేయాల్సి ఉంటుంది. ఇలా వారంలో రెండు సార్లు చేయడం వల్ల జుట్టు సమస్యలు రాకుండా ఉంటాయి. అయితే ఆరోగ్యకరమైన జుట్టు కోసం బాదం నూనె మర్దన ఎంతో మేలు చేస్తుంది. ప్రతిరోజు బాదం నూనెతో జుట్టు కుదుళ్ల నుంచి రెండు మూడు సార్లు మర్ధన చేయాలి. ఇది జుట్టు ఊడటాన్ని కొంతవరకు తగ్గిస్తుంది. 


ఇతర చిట్కాలు:


ఈ చిట్కాలను క్రమం తప్పకుండా పాటించడం మంచి ఫలితాలు కలుగుతాయి. అంతేకాకుండా ఉపయోగించే పదార్థాలలో నాణ్యమైన పదార్థాలను ఉపయోగించండి.
మీకు ఏదైనా అలెర్జీలు ఉంటే, ఈ చిట్కాలను ఉపయోగించే ముందు వైద్యుడిని సంప్రదించండి. జుట్టు ఊడటానికి అనేక కారణాలు ఉండవచ్చు. జుట్టు ఊడిపోవడం ఎక్కువగా ఉంటే, మూల కారణాన్ని గుర్తించి చికిత్స పొందడానికి వైద్యుడిని సంప్రదించడం మంచిది.


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి