సులువుగా రోగ నిరోధకశక్తిని పెంచే చిట్కాలు
How to improve immunity naturally | ప్రపంచ దేశాలు కరోనా వైరస్ మహమ్మారితో పోరాడుతున్నాయి. నిజమే కరోనా లాంటి మహమ్మారికి వ్యాక్సిన్ రూపొందించేంత వరకు కేవలం ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలి.
ప్రపంచ దేశాలు కరోనా వైరస్ మహమ్మారితో పోరాడుతున్నాయి. ఈ సమయంలో డాక్టర్లు, అధికారులు, శాస్త్రవేత్తలు పదే పదే ప్రస్తావిస్తున్న అంశం శుభ్రంగా చేతులు కడుక్కోవడం, రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం. నిజమే కరోనా లాంటి మహమ్మారికి వ్యాక్సిన్ రూపొందించేంత వరకు కేవలం ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలి. బ్రేక్‌ఫాస్ట్ ఎక్కువగా తింటున్నారా.. ఇది తెలుసుకోండి
జంగ్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్‌ను తినడం మానేయాలి. ఇంట్లో తయారుచేసే రుచికరమైన, ఆరోగ్యకరమైన ఆహారాన్నే తీసుకుంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ప్రొటీన్లు, జింక్ అధికంగా లభ్యమయ్యే లీన్ మటన్, చేపల్ని తినాలి. మీ శరీరానికి పడని ఆహారం జోలికి వెళ్లకపోవడమే మంచింది. ఆహారంలో పసుపు విరివిగా తీసుకోవాలి. లేకపోతే గోరు వెచ్చని పాలల్లో పసుపు కలుపుకుని తాగాలి. Photos: రానా, మిహికా రోకా వేడుక.. ఫొటో గ్యాలరీ
వెల్లుల్లి తినాలి. వెల్లుల్లిలో ఉండే పోషకాలు.. యాంటీ బయాటిక్‌గా పనిచేస్తాయి. వెల్లుల్లితో పాటు అల్లంను మన ఆహారంలో తీసుకుంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఏ, డీ, ఈ విటమిన్లు అధికంగా ఉండే పదార్థాలు, జింక్, సెలీనియం ఉండే పోషక పదార్థాలు మిమ్మల్ని మరింత ఆరోగ్యవంతంగా చేస్తాయి. తొడలు లావుగా ఉన్నాయా.. అయితే మీకు శుభవార్త
రోజూ ఒక కప్పు పెరుగు తీసుకోవడం ఆరోగ్యానికి శ్రేయస్కరం. ఆకుకూరలు, కోడిగుడ్డు, ఓట్స్, బ్రకోలీ, బార్లీ, యాపిల్, బెర్రీలు, విటమిన్ సి లభించే పండ్లు, పదార్థాలను తీసుకుంటే రోగ నిరోధక శక్తి పెరిగి మరింత ఆరోగ్యవంతంగా తయారవుతారు. కరోనాకు టీకా వచ్చేంతవరకూ రోగ నిరోధక శక్తిని పెంచుకుంటూ వైరస్ మహమ్మారితో పోరాటం కొనసాగించడమే ప్రత్యామ్నాయ మార్గమని సూచిస్తున్నారు. (Image used for representation only (Courtesy: Pixabay)) జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
వరల్డ్ క్రేజీ మోడల్ బికినీ ఫొటోలు వైరల్