Is Coffee Good For The Liver: మ‌న శ‌రీరంలోని అతి ముఖ్యమైన అవ‌యవాల్లో కాలేయం కూడా ఒక‌టి. కాలేయం మ‌న శ‌రీరంలో అనేక ముఖ్యమైన విధులను నిర్వర్తిస్తుంది. కాలేయం..మనకి కావాల్సిన హార్మోన్లను ఉత్పత్తి చేయడం సహా శరీరంలోని మలినాలను నిర్మూలించేందుకు సహకరిస్తుంది. అయితే కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కూడా చాలా ముఖ్యం. కాలేయ ఆరోగ్యం దెబ్బతింటే మన శరీరం తీవ్ర అనారోగ్యానికి గురవుతుంది. కాబట్టి కాలేయానికి హాని కలిగించే ఆహారాన్ని తీసుకోవడం నియంత్రించుకోవాలి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మారిన జీవన విధానం, ఆహారపు అలవాట్ల కారణంగా మనలో చాలా మంది ఫ్యాటీ లివర్ (కాలేయంలో కొవ్వు) సమస్యలతో బాధపడుతున్నారు. జంక్ ఫుడ్ ను ఎక్కువగా తీసుకోవడం, నూనెలో బాగా వేయించిన పదార్థాలను అతిగా తినడం వల్ల అధిక బరువు (స్థూలకాయం)కు కారణం అవుతాయి. ఈ విధంగా శరీరంలోని అనేక అవయవాల్లో కొవ్వు పేరుకుపోతుంది. అయితే ఫ్యాటీ లివర్‌లో రెండు రకాలు ఉన్నాయి. ఆల్కహాలిక్, నాన్ - ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్. 


అయితే ఈ ఫ్యాటీ లివర్ సమస్యలతో బాధపడే వారిలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. పొట్టలో కుడివైపు నొప్పి.. కళ్లు, చర్మం పసుపు రంగులోకి మారడం సహా దురద, కడుపులో వాపు వంటివి కనిపిస్తాయి. పాదాల్లో నీరు చేరడం, మూత్రం పసుపు రంగులో రావడం, అలసట, వాంతులు, విరోచనాలు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యుడ్ని సంప్రదించడం మేలు. 


కాఫీ తాగితే మంచిదా?
నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడే వారు కాఫీ తాగితే ఉపశమనం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. కాఫీలో క్లోరోజెనిక్ యాసిడ్‌తో పాటు పాలీఫినాల్స్, కెఫిన్, మిథైల్క్సాంథైన్, లిపిడ్లు, పొటాషియం, మెగ్నీషియం వంటి పోష‌కాలు దండిగా ఉన్నాయి. కాలేయంలో చేరిన కొవ్వును తొలగించడంలో కాఫీ ఎంతో సహాపడుతుంది. అయితే కాఫీ మేలు చేసేదే అయినా మితంగా తాగడం ఉత్తమం. రోజుకు 2 నుంచి 3 కప్పుల కాఫీ మాత్రమే తీసుకోవడం మంచిది. 


మరోవైపు కాలేయ సమస్యలతో బాధపడే వారు కాఫీతో పాటు ఇతర ఆరోగ్యాన్ని సంరక్షించే సమతుల్య ఆహారాన్ని తీసుకోవాలి. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడడంలో వెల్లుల్లి మనకి ఎంతగానో సహాయపడుతుంది. కాలేయాన్ని సంరక్షించే ఎంజైమ్‌లు వెల్లుల్లిలో ఎక్కువగా ఉంటాయట. దీంతో పచ్చి కూరగాయాలు, ఆకుకూరలను ఎక్కువగా తీసుకోవడం మంచిది. ఇవి కాలేయ ఆరోగ్యాన్ని ఎంతో మేలు చేస్తాయి. అలాగే విటమిన్ - సి ఎక్కువగా ఉండే సిట్రస్ జాతి పండ్లును తినేందుకు ఎంచుకోవాలి. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఈ విధంగా తగిన సమతుల్య ఆహారాలను తీసుకుంటూ కాలేయాన్ని కొవ్వు బారి నుంచి రక్షించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి