Kasara Kayalu Benefits:  పల్లెటూర్లలో నివసించే వారికి కాసర కాయల గురించి అందరికీ తెలిసి ఉంటుంది. ఎందుకంటే వీటికి సంబంధించిన మొక్కలు పొలాల చుట్టుపక్కల తోటలలో ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. దీని మొక్క చూడడానికి అచ్చం కాకరకాయ తీగల్లానే ఉంటుంది. ఇవి ఎండాకాలం కంటే ఎక్కువగా వర్షాకాలంలో లభిస్తాయి. అయితే వీటిని చాలామంది కూరలా తయారు చేసుకుని తీసుకుంటారు. ఇలా తీసుకోవడం వల్ల శరీరానికి ఎన్నో రకాల లాభాలు కలుగుతాయి. ఈ కాసరకాయలు అనేకరకాల ఔషధ గుణాలను నిండి ఉంటాయి. కాబట్టి క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. వీటి రుచి కూడా ఎంతో బాగుంటుందని వారంటున్నారు. పల్లె ప్రాంతాల్లో ఈ కాసరకాయలతో ఎక్కువగా కారం, పచ్చళ్ళు తయారు చేసుకుంటారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి ఇందులో దాగి ఉన్న క్యాల్షియం ఐరన్ శరీరంలోని కండరాలను బలోపేతం చేయడానికి ఎంతగానో సహాయపడతాయి అంతేకాకుండా ఎముకలను దృఢంగా చేసేందుకు కూడా పడతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. దీంతోపాటు ఇందులో విట‌మిన్ సి, క్యాల్షియం, బీటా కెరోటీన్, పొటాషియం, జింక్ వంటి అనేక రకాల పోషకాలు లభిస్తాయి. కాబట్టి మధుమేహంతో బాధపడుతున్నవారు వీటితో తయారుచేసిన పచ్చడిని ప్రతిరోజు తీసుకోవడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. దీంతోపాటు ఇందులో ఉండే గుణాలు రక్తంలోని చక్కర పరిమాణాలను నియంత్రించేందుకు కూడా సహాయపడతాయి.



ఈ కాసరకాయలను ప్రతి వారం తీసుకోవడం వల్ల దంతాలు కూడా ఎంతో దృఢంగా మారుతాయని పరిశోధనలో తేలింది. దీంతోపాటు గుండె సమస్యలతో బాధపడే వారు కూడా ఈ కాయలను ఆహారంలో తీసుకోవచ్చని ఆయుర్వేద నిబంధనలు చెబుతున్నారు వీటితో తయారు చేసిన ఆహార పదార్థాలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది. దీంతోపాటు క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు కూడా రాకుండా ఉంటాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.


ఈ కాసరకాయల్లో ఉండే ఔషధ గుణాలు రోగ నిరోధక శక్తిని పెంచి వైరస్ ల నుంచి కూడా శరీరాన్ని రక్షిస్తాయి ముఖ్యంగా వీటిని వర్షాకాలంలో తీసుకోవడం వల్ల సీజనల్ వ్యాధులు రాకుండా ఉంటాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అలాగే మహిళల్లో వచ్చే రక్తహీనత ఇతర సమస్యల నుంచి కూడా కాసరకాయలు తినడం వల్ల దూరమవుతాయి. ముఖ్యంగా అధిక బరువు సమస్యతో బాధపడుతున్న వారు ఈ కాయలను తప్పకుండా తీసుకోవాలి. ఇందులో ఉండే ఫైబర్ గుణాలు శరీరంలోని కొలెస్ట్రాల్ ను తగ్గించి ఆకలిని నియంత్రిస్తాయి దీనికి కారణంగా శరీర బరువు కూడా తగ్గుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.


Also Read Ginger Side Effects: అల్లాన్ని వినియోగించే వారికి బ్యాడ్‌ న్యూస్‌..ఇలా తీసుకుంటే ఆరోగ్యానికి ముప్పే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter