CRISIL Report On Indian Thali Price: గత నెలలో ఆహార పదార్థాలు ఖర్చులు గణనీయంగా తగ్గాయని  సంస్థ నిర్వహించిన సర్వేలో తేటతెల్లమయింది. ముఖ్యంగా శాఖాహారం కన్నా కూడా మాంసాహార పదార్థాలే ధర తగ్గాయని ఈ సర్వేలో తేలడం విశేషం. ఆగస్టు నెలలో శాఖాహారం పదార్థాల కన్నా కూడా మాంసాహారం పదార్థాలే ఎక్కువ శాతం ధర తగ్గినట్టు ఈ సర్వేలో తేలింది. క్రిసిల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ అండ్ అనలిటిక్స్ రీసెర్చ్‌లో  పలు ఆసక్తికరమైనటువంటి విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రధానంగా టమాటా, బ్రాయిలర్ కోడి వంటి కీలక పదార్థాల ధరలు తగ్గుముఖం పట్టడమే ఇందుకు కారణమని నివేదిక పేర్కొంది. అందుబాటులోని సమాచారం ప్రకారం, శాఖాహార పదార్థాల సగటు ధర సంవత్సరానికి 8శాతం తగ్గగా, అయితే మాంసాహార ఆహార పదర్థాల ధర సంవత్సరానికి 12శాతం తగ్గింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టమోటా ధర తగ్గింది:


అయితే ఆగస్టు నెలలో  కూరగాయలలో ప్రధానంగా టమాటో ధర 14శాతం తగ్గింది. ఏడాది ప్రాతిపదికన చూస్తే 51% తగ్గుదల నమోదు అయ్యింది.  ఆగస్టు 2023లో కిలో రూ. 102 నుండి ఆగస్టు 2024 నాటికి రూ. 50కి పడిపోయింది. ఢిల్లీలో 14.2 కిలోల ఎల్‌పిజి సిలిండర్ ధర గతేడాదితో పోలిస్తే 27శాతం తగ్గి రూ.1,103 నుంచి రూ.803కి చేరింది.


Also Read : LIC Kanyadan Policy: ఎల్ఐసీ నుంచి ఆడపిల్ల భవిష్యత్తు కోసం సరికొత్త పాలసీ.. మెచ్యూరిటీ తర్వాత మీ చేతికి 28 లక్షలు


బ్రాయిలర్ చికెన్ ధరల్లో 13శాతం తగ్గింపు:


వంట నూనె 6శాతం, మిరపకాయ శాతం , జీలకర్ర ధరలు 50శాతం తగ్గడం విశేషం- బ్రాయిలర్ చికెన్ ధరలను 13శాతం తగ్గుదల నమోదు అయ్యింది. ఇక బంగాళదుంపల రిటైల్ ధరలు వరుసగా రూ.13 చొప్పున పెరగడంతో ఆ కూరగాయలపై ఎక్కువగా కనిపించింది. 


నెలవారీ ప్రాతిపదికన, శాఖాహారం, మాంసాహార పదార్థాల ధరలు  రెండూ క్షీణించాయి, ఖర్చులు వరుసగా 4శాతం, 3శాతం తగ్గాయి. ఈ నెలవారీ క్షీణతకు ప్రధానంగా 23శాతం తగ్గుదల కారణంగా టొమాటో ధరలు జులై 2024లో కిలో రూ.66 నుండి ఆగస్టు 2024లో కిలో రూ.50కి తగ్గాయి. నాన్-వెజిటేరియన్ పదార్థాల ధర తగ్గడానికి ప్రధాన కారణం, శ్రావణ మాసంలో తగ్గిన వినియోగమే అని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా బ్రాయిలర్ కోడి ధరలు 1-3శాతం తగ్గుదల కారణంగా క్షీణత కనిపించినట్లు తెలిపారు. అయినప్పటికీ, మొత్తం తగ్గుదల గత నెలతో పోలిస్తే బంగాళదుంపల ధరలలో 2శాతం  పెరుగుదల నమోదు చేశారు. ఉల్లిపాయల ధరలలో 3శాతం పెరుగుదల నమోదు అయ్యింది. ఇదిలా ఉంటే దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వరదలు తుఫానుల కారణంగా పంట దిగుబడి తగిన నేపథ్యంలో కూరగాయల ధరలు సెప్టెంబర్ మాసంలో పెరిగే అవకాశం ఉందని కూడా అంచనాలు వెలువడుతున్నాయి.


Also Read : Best Business Ideas:  మహిళలు ఈ ఒక్క చిన్న కోర్సు నేర్చుకుంటే చాలు.. సీజన్‎లో రోజు రూ. 10వేలు సంపాదించే చాన్స్   


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.