Kidnapping the Bride: ఇండోనేషియా(Indonesia)’లోని ‘సుంబా దీవి(sumba Island)’లో రాక్షస వివాహాలు జరుగుతున్నాయి. అయితే ఈ పెళ్లిళ్లు .. అమ్మాయిల ఇష్టంతో జరుగుతున్నవి కావు. అబ్బాయిలు బలవంతంగా మనువాడుతున్నవి. ఈ దురాచారం అక్కడ ‘'కవిన్‌ టాంగాప్‌'’ అనే పేరుతో కొనసాగుతున్నది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

‘సుంబా’ ప్రజల ఇతర ఆచారాలూ, నమ్మకాలూ చాలా విచిత్రంగా ఉంటాయి. వీరు ‘మరపు’ అనే ప్రాచీనమతాన్ని కూడా ఆచరిస్తారు. వస్తువులకు ప్రాణం ఉందని నమ్ముతారు. నీళ్లు నుదుటిని తాకితే ఇంట్లోంచి బయటికి వెళ్లకూడదనేది వీరి విశ్వాసం. అందుకే కిడ్నాప్‌(Kidnap) అయిన అమ్మాయిని ఇంట్లోకి లాక్కెళ్లి తలకు నీళ్లు తాకిస్తారు. ఇక తాను ఇష్టపడిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి యువకుడు అవసరమైతే తన బంధుగణంతో అమ్మాయి ఇంటి మీదకు దండయాత్రకూ వెళ్తాడు. అప్పుడు అమ్మాయిని కిడ్నాప్ చేసి..  అమ్మాయిని ఎత్తుకొని వెళ్ళాడు అంటే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం అయితే కిడ్నాప్ అనంతరం అదే వ్యక్తికి ఆ మహిళ ను ఇచ్చి వివాహం చేస్తారు. అయితే ఒకవేళ ఆ అమ్మాయికి అబ్బాయి నచ్చకపోయినా కాపురం చేయాల్సిందే.


Also Read: Bizarre First Night Tradition: పెళ్లైన 3 రోజులు బాత్రూంకి వెళ్లకుండా శోభనం.. వింత ఆచారం!


కిడ్నాప్‌ తర్వాత పెళ్లి నుంచి తప్పించుకున్న అమ్మాయిలు చాలా అరుదు. ఒకవేళ తప్పించుకున్నా ఆ అమ్మాయికి సమాజంలో గౌరవం ఉండదు. పెళ్లి చేసుకోవడానికి, పిల్లలు కనడానికి వారు తగరని వెలివేస్తారు. అవమానకరంగా చూస్తారు. ఆ భయంతో అక్కడి ఆడపిల్లలు కిడ్నాప్‌ చేసినవారినే పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడతారు. అందుకే ఇటువంటి వింత ఆచారాలను ప్రోత్సహించకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తుంది.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి