Instant Glow Face Masks: ముఖంపై మురికి పేరుకుపోవడం వల్ల మేకప్ ఫేస్‌పై ఎక్కువ సేపు నిలవడం లేదు. అంతేకాకుండా ముఖం జిడ్డుగా తయారవుతుంది. ముఖ్యంగా చర్మంపై దద్దుర్లు రావడం.. ఇతర సమస్యలు వస్తున్నాయి. అయితే ఈ సమస్యల నుంచి విముక్తి పొందడానికి చాలా మార్గాలున్నాయి. కానీ ఇవి ఆశించిన ఫలితాలను ఇవ్వలేకపోతున్నాయి. ముఖాన్ని మెరిసేలా చేయడానికి.. జిడ్డును నియంత్రించడానికి తక్షణ గ్లోయింగ్ ఫేస్ మాస్క్‌ని ఉపయోగించవచ్చు. అయితే ఎలాంటి ఫేస్‌ మాస్క్‌లు వినియోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పెరుగు చేసిన ఫేస్‌ మాస్క్‌(Yogurt Face Mask):


మొటిమలు ఉన్న చర్మానికి, ముఖానికి ఈ ఫేస్ ప్యాక్ చాలా ప్రభావవంతంగా పని చేస్తుంది. దీన్ని ముఖానికి అప్లై చేయడం వల్ల ఈ మాస్క్‌తో తక్షణ గ్లో పొందవచ్చు. ముఖానికి ఉన్న మొటిమలన్ని తొలగిపోతాయి.డ


ఈ మాస్క్‌ కోసం కావాల్సిన పదార్థాలు:


- 2 టేబుల్ స్పూన్ల పెరుగు
- 1 టేబుల్ స్పూన్ బేసన్
- 1 స్పూన్ ముల్తానీ మిట్టి


ఎలా ఉపయోగించాలి:


ఈ మూడు పదార్థాలను కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. దీనిని అప్లై చేయడానికి ముందు ముఖాన్ని శుభ్రం చేయాలి. ఆ తర్వాత ముఖానికి అప్లై చేసి 15-20 నిమిషాల పాటు అలాగే ఉంచి.. ఆపై నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే మంచి ఫలితాలను పొందుతారు.


కలబంద ఫేస్‌ మాస్క్‌(Aloe vera mask):


కలబంద బ్యాక్టీరియాతో పోరాడానికి ప్రభావవంతంగా పని చేస్తుంది. ఆరోగ్యమై చర్మాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తుంది. ఇది చర్మాన్ని లోపలి నుంచి రిపేర్‌ చేస్తుంది. అంతేకాకుండా కలబంద మిశ్రమంలో నిమ్మకాయ రాసాన్ని కలిపితే మొటిమల నుంచి సంరక్షిస్తుంది. కావున మొటిమలతో బాధపడుతున్న వారు తప్పకుండా ఈ మిశ్రమాన్ని వాడండి. ముఖంపై అన్నిసమస్యలు దూరమవుతాయి.


ఈ మిశ్రమానికి కావాల్సిన పాదార్థాలు:


- 2 టేబుల్ స్పూన్లు తాజా కలబంద మిశ్రమం
- నిమ్మరసం 5-6 చుక్కలు


దీనిని ఎలా వినియోగించాలి:


ఈ రెండు పదార్థాలను బాగా మిక్స్‌ చేయాలి. ఆ తర్వాత ముఖానికి అప్లై చేసి.. తేలికపాటి చేతులతో ముఖాన్ని మసాజ్ చేయండి. ఆ తర్వాత 10 నుంచి 15 నిమిషాల తర్వాత బాగా కడగండి. ఇలా చేయడం త్వరలోనే ప్రయోజనాలు పొందుతారు.


తేనెతో ఫేస్‌ మాస్క్‌(Mask honey):


తేనెలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. అందువల్ల తేనె చర్మానికి తేమను కూడా అందిస్తుంది. అంతేకాకుండా చర్మాన్ని ఇతర వ్యాధుల నుంచి రక్షిస్తుంది.


ఈ మిశ్రమానికి కావాల్సిన పదార్థాలు:


- 1 టేబుల్ స్పూన్ కాఫీ
- 1 టీస్పూన్ తేనె


వినియోగించే పద్దతులు:


రెండింటినీ మిక్స్ చేసి ముఖానికి సమానంగా అప్లై చేయాలి. 10 నిమిషాల పాటు అలాగే ఉంచి.. ముఖాన్ని మసాజ్ చేయండి. అంతే ముఖంపై సమస్యలన్ని మాయమవుతాయి.


(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)


Also Read:  Weight loss In 5 Days: ఎన్ని చిట్కాలు పాటించిన బరువు తగ్గలేకపోతున్నారా.. అయితే ఇలా సుభంగా 5 రోజుల్లో క్యాబేజీతో బరువు తగ్గండి..!


Also Read:  Weight loss tips in 10 days: వీటితో తయారు చేసిన రొట్టెలను తింటే పది రోజుల్లో బరువు తగ్గుతారు..!



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook