Peeing After Intercourse: మంచి లైంగిక జీవితం అనుభవించాలనుకున్నా.. సంతాన పునరుత్పత్తి కలిగి ఉండాలనుకున్నా.. శృంగారంలో ఎల్లప్పుడూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. శృంగారంలోనే కాదు.. శృంగారానికి ముందు, శృంగారానికి తరువాత కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే లైంగికంగా సంక్రమించే వ్యాధులు, మూత్ర మార్గము అంటువ్యాధులు, ఇతర వైరల్, బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉంటుంది. ఈ కారణంగానే చాలామందికి సెక్స్ విషయంలో అనేక అపోహలు, అనుమానాలు కలుగుతుంటాయి. ఉదాహరణకు, వీర్యం విడుదలైన తర్వాత దానికి ఎక్కువ లైఫ్ ఉండదు. టాయిలెట్ సీటుపై కూర్చొంటే సెక్సువల్లీ ట్రాన్స్‌మిటెడ్ ఇన్‌ఫెక్షన్స్ సోకుతాయి లాంటి సందేహాలను ఉదాహరణగా చెప్పుకోవచ్చు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అలాగే చాలామంది వద్ద ఎక్కువగా వినబడే సందేహాల్లో మరొకటి ఉంది. అదేంటంటే.. స్త్రీ, పురుషులు సెక్స్‌కు ముందు, సెక్సుకు తర్వాత మూత్ర విసర్జన చేయాలా అనే సందేహం చాలామందికి కలుగుతుంటుంది. ముఖ్యంగా మహిళలు విషయంలో ఈ సందేహం ఎక్కువగా ఉంటుంది. అయితే అలా కొంతమంది చెబుతున్నట్టుగా సెక్స్‌కు ముందు, సెక్స్‌కి తర్వాత మూత్ర విసర్జన చేయడం నిజంగా అవసరమా ? లేదా అనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి.


వాస్తవం ఏంటంటే..
మహిళల మూత్రనాళంలోకి ప్రవేశించే బ్యాక్టీరియా మూత్రాశయంలోకి వెళ్లి రెట్టింపు అవడం జరిగితే.. అది యురినరి ట్రాక్ట్ ఇన్‌ఫెక్షన్స్‌కి దారితీస్తుంది. అదే కానీ జరిగితే మూత్రంలో మంటగా అనిపించడం వంటి సమస్యలు ఎదురవుతాయి. శృంగారం సమయంలో జననేంద్రియం నుండి స్త్రీ మూత్రనాళం ద్వారా మూత్రాశయంలోకి ప్రవేశించే బ్యాక్టీరియా స్త్రీల ఆరోగ్యాన్ని దెబ్బతీసి అనారోగ్యం బారినపడేలా చేస్తుంది.


చాలా మంది స్త్రీలు సెక్స్‌లో పాల్గొనడానికి ముందు మూత్ర విసర్జన చేస్తుంటారు. శృంగారంలో ఎక్కువసేపు పాల్గొన్నట్టయితే.. బ్లాడర్ పై ఒత్తిడి పడకుండా శృంగారాన్ని ఆస్వాదించేందుకు ఈ చిట్కా ఉపయోగపడుతుంది. అలాగే సెక్స్ తర్వాత కూడా మూత్ర విసర్జన అంతే అవసరం అంటున్నారు హెల్త్ ఎక్స్‌పర్ట్స్. దాని వెనుకాల కూడా ఓ సైన్స్ ఉంది. ఒకవేళ శృంగారం సమయంలో ఏదైనా బ్యాక్టీరియా స్త్రీల మూత్రనాళంలోకి ప్రవేశించినట్టయితే.. శృంగారం తరువాత మూత్రవిసర్ణనకు వెళ్లడం ద్వారా మూత్రాశయంలోకి వెళ్లడానికి ప్రయత్నిస్తున్న బ్యాక్టీరియాను బయటకు నెట్టివేస్తుందని హెల్త్ కేర్ ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు. మూత్రవిసర్జన చేయడం వల్ల అన్నిసందర్భాల్లో యురినరి ట్రాక్ట్ ఇన్‌ఫెక్షన్స్‌కి కచ్చితంగా చెక్ పెట్టవచ్చని అధ్యయనాల్లో తేలనప్పటికీ.. ఇది ఒక పరిష్కారమార్గంగా మాత్రం ఉపయోగపడుతుంటున్నారు.


సెక్స్ తర్వాత ఎంత త్వరగా మూత్ర విసర్జన చేయాలి
సెక్స్ తర్వాత మహిళల మూత్రాశయంలోకి ఏదైనా బ్యాక్టీరియా ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నట్టయితే..  మహిళలు మూత్రవిసర్ణన చేయడం వల్ల మూత్రం ద్వారానే ఆ బ్యాక్టీరియా మళ్లీ బయటికి వెళ్లిపోతుంది అనేంత వరకు బాగానే ఉంది కానీ.. సెక్స్ తరువాత ఎంతసేపటి వరకు ఇది వర్తిస్తుంది అనే ప్రశ్న కూడా తలెత్తుతుంది. అయితే, శృంగారంలో పాల్గొన్న తర్వాత 30 నిమిషాలలోపు మూత్ర విసర్జన చేస్తే ప్రయోజనం ఉంటుందని.. ఎక్కువసేపు ఆలస్యం చేస్తే.. మూత్రాశయంలోకి బ్యాక్టీరియా ప్రవేశించే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.


ఎక్కువ టెన్షన్ పడాల్సిన పనిలేదు..
ఇదే అంశంపై ఫిలడెల్ఫియాకు చెందిన స్త్రీ జననేంద్రియ నిపుణురాలు సారా హోర్వత్ ఉమెన్స్ హెల్త్‌తో మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. సెక్స్ ముగిసిన తర్వాత మహిళలు మూత్ర విసర్జన చేయడం గురించి ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. తరచుగా యురినరి ట్రాక్ట్ ఇన్‌ఫెక్షన్స్ బారిన పడుతున్నట్టయితేనే ఇది వర్తిస్తుందని అన్నారు. పరిశుభ్రత పాటించడం, తరచుగా చేతులు శుభ్రంగా కడుక్కోవడం వంటి మంచి ఆరోగ్యకరమైన అలవాట్లను అలవర్చుకుంటే మూత్ర సంబంధిత వ్యాధుల నుంచి బయటపడొచ్చని అన్నారు. అలాగే కొత్త పార్ట్‌నర్‌తో లైంగిక సంపర్కంలో పాల్గొంటే కండోమ్‌లను తప్పనిసరిగా ఉపయోగించాలి అని సారా హోర్వత్ సూచించారు.


ఇది కూడా చదవండి : Jaggery Vs Sugar: మీ ఆరోగ్యానికి షుగర్ మంచిదా..? లేక బెల్లం మంచిదా..?


ఇది కూడా చదవండి : Blueberries Health Benefits: బ్లూబెర్రీస్.. తింటే ఆల్ హ్యాపీస్


ఇది కూడా చదవండి : Hair Loss Issue: జుట్టు రాలుతోందని టెన్షన్ పడుతున్నారా ?


ఇది కూడా చదవండి : Cheap and Best Car: తక్కువ ధరలో ఎక్కువ సేఫ్టీని ఇచ్చే బెస్ట్ కారు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


యాపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook