Jaggery Vs Sugar: మీ ఆరోగ్యానికి షుగర్ మంచిదా..? లేక బెల్లం మంచిదా..?
Jaggery Vs Sugar, Which is Best For Health: నిత్యం ఏదో ఓ రూపంలో స్వీట్ టేస్ట్ కోసం మనం తీసుకునే ఆహారంలో షుగర్ యాడ్ చేస్తుంటాం కదా.. ఇది ఆరోగ్యానికి మంచి అలవాటేనా కాదా అనే సందేహం కొంతమందిని వేధిస్తుంటుంది. ఇంకొంతమందికి అసలు ఆరోగ్యానికి బెల్లం మంచిదా ? లేక షుగర్ మంచిదా అనే సందేహం వెంటాడుతుంది. అలాంటి సందేహాలకు సమాధానం ఇదిగో.
Jaggery Vs Sugar, Which is Best For Health: రోజూ ఉదయం, సాయంత్రం టీ తాగినా, కాఫీ తాగినా.. అందులో రుచి కోసం షుగర్ యాడ్ చేస్తుంటారు. ఇది సర్వసాధారణం. కొన్నిసార్లు... మరీ ముఖ్యంగా ఈ వేసవి సీజన్‌లో ఎండలో తిరిగొచ్చాకా ఎండ వేడి నుంచి ఉపశమనం పొందడం కోసం తీసుకునే చల్లటి డ్రింక్స్‌లోనూ టేస్ట్ కోసం షుగర్ యాడ్ చేస్తుంటారు. ఇది కూడా అంతే సర్వసాధారణం. అయితే, చాలామందికి కలిగే ఓ సందేహం ఏంటంటే.. ఇలా నిత్యం ఏదో ఓ రూపంలో స్వీట్ టేస్ట్ కోసం మనం తీసుకునే ఆహారంలో షుగర్ యాడ్ చేస్తుంటాం కదా.. ఇది ఆరోగ్యానికి మంచి అలవాటేనా కాదా అనే సందేహం కొంతమందిని వేధిస్తుంటుంది. ఇంకొంతమందికి అసలు ఆరోగ్యానికి బెల్లం మంచిదా ? లేక షుగర్ మంచిదా అనే సందేహం వెంటాడుతుంది. అలాంటి సందేహాలకు సమాధానం ఇదిగో.
షుగర్ కంటే బెల్లం తీసుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసా ?
షుగర్‌తో పోల్చుకుంటే బెల్లం నెమ్మదిగా జీర్ణం అవుతుంది. శరీరానికి అవసరమైన ఐరన్ బెల్లం నుంచి లభిస్తుంది. అది కూడా మొక్కల ద్వారా అందాల్సిన ఐరన్‌కి బెల్లం ఏకైక వనరుగా చెబుతుంటారు. కండరాల పనితీరు మెరుగుపర్చి, శరీరానికి అవసరమైన శక్తిని అందించడంలో బెల్లం కీలక పాత్ర పోషిస్తుంది. బెల్లంతో మెటాబాలిజం కూడా మెరుగుపడుతుంది కనుక.. పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును బల్లం వేగంగా, సులభంగా కరిగిస్తుంది.
పంచదార విషయానికొస్తే.. పంచదార తీసుకోవడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ అమాంతం పెరుగుతాయి. ఇది కొద్దికాలంలోనే బరువు పెరిగేందుకు కూడా కారణం అవుతుంది. అంతేకాకుండా షుగర్ కన్సంప్షన్ వల్ల ఒళ్లు నొప్పిగా ఉండటం, అలసటగా ఉండటం జరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. పంచదారను అధికంగా ఉపయోగించడం వల్ల టైప్ 2 డయాబెటిస్ బారిన పడటంతో పాటు గుండె జబ్బులకు కూడా దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
షుగర్ తయారు చేయడంలో అనేక రకాల రసాయనాలు ఉపయోగిస్తారు. కానీ బెల్లం విషయంలో అలా కాదు. అందుకే పంచదారతో పోల్చుకుంటే.. బెల్లంతో కలిగే హానీ కూడా చాలా తక్కువే. ఎనిమియా లోపంతో బాధపడే వారికి బెల్లంతో చేసిన ఫుడ్ మంచి హెల్తీ ఫుడ్. ఎందుకంటే బెల్లంలో మెగ్నీషియం, కాల్షియం, ఐరన్, పొటాషియం, జింక్, సెలెనియం అధిక మోతాదులో ఉంటాయి. ఇవి ఎనిమియా లోపాన్ని అధిగమించడానికి ఉపయోగపడతాయి. బెల్లంలో కొన్ని ఔషద గుణాలు కూడా ఉంటాయని పలు అధ్యయనాల్లో తేలింది. అయితే ఇందులో ఏమేరకు నిజం ఉందనే కోణంలో ఇంకా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి.
Also Read: Sonu Nigam Attack Video : స్టార్ సింగర్‌పై ఎమ్మెల్యే కొడుకు దాడి.. ఈవెంట్‌లో గొడవ.. వీడియో వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook