Bad Cholesterol: శాశ్వతంగా ఎలాంటి ఖర్చు లేకుండా చెడు కొలెస్ట్రాల్‌కు వీటితో చెక్..
Juice For Bad Cholesterol: చాలా మంది చెడు కొలెస్ట్రాల్ పెరగడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఆరోగ్య నిపుణులు సూచించిన ఈ చిట్కాలను వినియోగించండి.
Juice For Bad Cholesterol: ఆధునిక జీవన శైలిని అనుసరించడం వల్ల చాలా మంది చెడు కొలెస్ట్రాల్ సమస్యల బారిన పడుతున్నారు. ఇంతకుముందు ఈ సమస్య 40 ఏళ్ల వయసు గల వారిలో వస్తే.. ఇప్పుడు చిన్న వయసుల్లో, యువతలో ఇలాంటి ఈ సమస్యలు రావడం విశేషం. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగే తప్పకుండా అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. లేకపోతే అధిక రక్తపోటు, మధుమేహం, గుండెపోటు, గుండె నొప్పులు, కరోనరీ ఆర్టరీ వ్యాధి, ట్రిపుల్ నాళాల వ్యాధులు వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి ఈ శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడం చాలా మంచిది. కొలెస్ట్రాల్ నియంత్రించుకోవడానికి ఈ డ్రింక్స్ వినియోగించండి.
కొలెస్ట్రాల్ నియంత్రణ కోసం ఈ డ్రింక్స్ ట్రై చేయండి:
సొరకాయ రసం:
కూరగాయాల్లో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషకాలు లభిస్తాయి. కాబట్టి దీనిని క్రమం తప్పకుండా ఆహారంలో తీసుకుంటే శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా బాడీకి పోషకాలు అందుతాయి. అందుకే భారతీయులు సాంబార్‌లో వీటిని అతిగా వినియోగిస్తారు. ఇందులో కేలరీల పరిమాణాలు కూడా తక్కువగా ఉంటాయి. కాబట్టి దీనితో తయారు చేసిన డ్రింక్‌ను ప్రతి రోజూ ఖాళీ కడుపుతో తాగితే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది.
బీట్‌రూట్ జ్యూస్:
బీట్‌రూట్ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషకాలు లభిస్తాయి. అయితే బీట్‌రూట్ సలాడ్స్‌లో వినియోగిస్తే చెడు కొలెస్ట్రాల్ సులభంగా తగ్గుతాయి. అంతేకాకుండా ఈ బీట్‌రూట్‌తో తయారు చేసిన రసాన్ని ప్రతి రోజూ తాగితే అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. ఇందులో శరీరానికి కావాల్సిన విటమిన్ బి, ఫాస్పరస్ పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజూ ఈ రసాన్ని తాగితే చెడు కొలెస్ట్రాల్ సులభంగా నియంత్రణలో ఉంటుంది.
కాకర రసం:
కాకర చేదు ఉన్నప్పటికీ ఇందులో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషకాలు లభిస్తాయి. అంతేకాకుండా ఇందులో విటమిన్ ఎ, విటమిన్ ఇ, విటమిన్ కె, ఫైబర్ పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి వీటితో తయారు చేసిన రసాన్ని ప్రతి రోజూ తీసుకుంటే శరీరంలోని పేరుకు పోయిన కొలెస్ట్రాల్ సులభంగా తగ్గుతుంది.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read : Vijay Devarakonda ED : పాపులారిటీ ఉంటే ఇవన్నీ సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి.. ఈడీ విచారణపై విజయ్ కౌంటర్లు
Also Read : Nara Brahmani Bike Riding : బాలయ్య కూతురా? మజాకా?.. బైక్ రైడర్‌గా నారా బ్రహ్మణి యాత్ర
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook