Knee Pain Home Remedies: ఎలాంటి ఖర్చు లేకుండా ఇలా మోకాళ్ల నొప్పుల నుంచి తక్షణ ఉపశమనం పొందండి!
Knee Pain Home Remedies: తీవ్ర మోకాళ్ల నొప్పుల సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు ఈ ఆయుర్వేద చిట్కాలను ప్రతి రోజు వినియోగించడం వల్ల తక్షణ ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా తీవ్ర నొప్పుల నుంచి కూడా విముక్తి కలుగుతుంది.
Knee Pain Home Remedies: పూర్వీకులు వృద్ధాప్యంలో కూడా ఎంతో బలంగా ఉండేవారు..అయితే మారుతున్న జీవనశైలి కారణంగా వారిలో కూడా శరీర సమస్యలు వస్తున్నాయి. చాలా మంది వృద్ధుల్లో మోకాళ్ల నొప్పులు వస్తున్నాయి. దీంతో పాటు ఆధునిక జీవనశైలికి అలవాటు పడ్డ యువతలో కూడా ఇవే సమస్యలు వస్తున్నాయి. మోకాళ్ల నొప్పుల కారణంగా నడవడానికి తీవ్ర ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీని కారణంగా ఇతర సమస్యలకు కూడా దారి తీయోచ్చు..కాబట్టి మోకాళ్ల నొప్పులు ఉన్నవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తు తీసుకోవాల్సి ఉంటుంది.
ఈ నొప్పులు కొంతమందిలో తప్పుడు దినచర్య, ఆహారాల్లో పోషకాలు లేకపోవడం, ఇతర అనారోగ్య సమస్యల కారణంగా కూడా వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే చాలా మంది ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి మార్కెట్‌లో లభించే వివిధ రకాల పెయిన్ కిల్లర్స్‌ను వినియోగిస్తున్నారు. అయినప్పటికీ ఎలాంటి ఫలితాలు పొందలేకపోతున్నారు. ఈ సమస్యల నుంచి శాశ్వతంగా ఉపశమనం పొందడానికి ఆయుర్వేద నిపుణులు సూచించిన పలు చిట్కాలు పాటించాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
తప్పకుండా ఈ చిట్కాలు పాటించండి:
కలబంద:
ఆయుర్వేద నిపుణులు కలబందను ఔషధంగా భావిస్తారు. ఇందులో శరీరానికి కావాల్సిన చాల రకాల ఔషధ గుణాలు లభిస్తాయి. కాబట్టి తీవ్ర కీళ్ల, మోకాళ్ల నొప్పులతో బాధపడేవారు ప్రతి రోజు నొప్పి ప్రభావిత ప్రాంతంలో అలోవెరా జెల్‌ను అప్లై చేసి మసాజ్ చేసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల సులభంగా నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా మోకాళ్ల వాపుల నుంచి కూడా సులభంగా లభిస్తుందని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు.
పసుపు:
పసుపు యాంటీ బాక్టీరియల్‌గా పని చేస్తుంది. ఇందులో అనేక రకాల ఔషధ గుణాలు లభిస్తాయి. కాబట్టి దీనిని అన్ని రకాల వ్యాధులకు వినియోగించవచ్చని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. దీనిని మోకాళ్ల నొప్పులతో బాధపడేవారు ప్రతి రోజు వినియోగించడం వల్ల సులభంగా ఉపశమనం లభిస్తుంది. అయితేయ దీనిని వినియోగించే ముందు ఒక బౌల్ తీసుకుని అందులో ఆవాల నూనెను వేసి.. ఒక టీస్పూన్ పసుపును వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని ప్రభావిత ప్రాంతంలో అప్లై చేస్తే తక్షణ ఉపశమనం లభిస్తుంది.
కర్పూరం నూనె:
తీవ్ర మోకాళ్ల నొప్పుల కారణంగా బాధపడేవారు కర్పూరం నూనెను కూడా వినియోగించవచ్చని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు అన్ని రకాల నొప్పుల నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తాయి. అయితే దీనిని వినియోగించాలనుకునేవారు ముందుగా కర్పూరం నూనె తీసుకుని బౌల్‌లో పోసుకుని గోరువెచ్చగా చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఈ నూనెను ప్రభావితం ప్రాంతంలో అప్లై చేసి 15 నిమిషాల పాటు బాగా మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల సులభంగా తీవ్ర మోకాళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి