Husband Wife Secrets: పెళ్లాం ఊరెళితే సినిమా చూసే ఉంటారు కదా..పెళ్లాం బయటికెళ్తే సదరు భర్త ఏం చేస్తాడో మీరు ఊహించలేరు కూడా. భర్తలు చేసే ఆ 5 పనుల్ని..మహిళలు కలలో కూడా ఊహించలేరు. అవేంటో చూద్దాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

భార్యాభర్తల బంధం చాలా పవిత్రమైంది. సాధారణంగా ఎక్కువశాతం పురుషులు తమ భార్యల ముందు మంచిగా ఉండేందుకు లేదా మంచివాళ్లన్పించుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. పెళ్లైన తరువాత సహజంగానే భర్తలు తమకిష్టమైన పనులు కొన్ని చేయలేరు. ఈ పరిస్థితుల్లో ఇంట్లో భార్య లేకపోతే..పెళ్లాం ఊరెళితే ఆ భర్త అసలు స్వరూపం బయటపడుతుంటుంది. పెళ్లాం ఊరెళ్లినప్పుడు ఆ భర్తలు చేసే పనుల్ని కనీసం ఊహించలేరు కూడా. అలాంటి ఐదు పనులేంటో ఇప్పుడు తెలుసుకుందాం..


పెళ్లాం ఊరెళితే లేదా బయటకు ఎక్కడికైనా వెళ్లినప్పుడు చాలామంది భర్తలు విచిత్రమైన పనులు చేస్తుంటారట. ఫోన్ తీసుకుని గంటల తరబడి వాష్‌రూమ్‌లో గడుపుతుంటారు. ఒక్కోసారి ల్యాప్‌టాప్, ట్యాబ్ కూడా వాష్‌రూమ్స్‌లో తీసుకెళ్తుంటారు. దాంతోపాటు వార్తాపత్రికలు చదువుతుంటారు.


ప్రతి ఒక్కరికీ గతం అనేది ఉంటుంది. వైవాహిక జీవితంలో బాధ్యతలు పెరిగిపోతాయి. ఈ క్రమంలో చాలాసార్లు పురుషులు తమ పాత స్నేహితులతో కనీసం మాట్లాడలేరు. కానీ భార్య ఊరెళ్లినప్పుడు లేదా ఇంట్లో లేనప్పుడు గంటల తరబడి పాత స్నేహితులతో మాట్లాడుతుంటారు. కొంతమందైతే ఎక్స్ గర్ల్‌ఫ్రెండ్స్‌తో పిచ్చాపాటీ మాట్లాడుతుంటారు.


చాలామంది మహిళలకు టీవీల్లో సీరియల్స్ చూడటం ఇష్టంగా ఉంటుంది. అటువంటప్పుడు ఇంట్లో భర్త తమకిష్టమైనవి చూడలేకపోతుంటారు. కానీ పెళ్లాం ఊరెళ్లినప్పుడు మాత్రం హాయిగా, ప్రశాంతంగా టీవీ చూస్తుంటారు. టీవీలో మ్యాచ్ లేదా న్యూస్ లేదా ఇష్టమైన కార్యక్రమాలు హాయిగా చూస్తుంటారు.


ఇంకొంతమందైతే పెళ్లాం ఊరెళ్లగానే స్నేహితుల్ని ఇంటికి పిలిపిస్తారు. హాయిగా పార్టీలు చేసుకుంటారు. తమకు నచ్చిన రీతిలో సంబరాలు చేసుకుంటారు. సాధారణంగా పెళ్లాం పుట్టింటికో లేదా మరో ఊరికో వెళ్లినప్పుడు ఇలా చేస్తుంటారు. ఇంకొంతమంది తమకిష్టమైన వంటలు వండుకుని తింటుంటారు. కుకింగ్ అంటే ఇష్టముండే భర్తల విషయంలో ఇలా జరుగుతుంటుంది. 


Also read: Vegetables: ఈ కూరగాయలను అతిగా తింటున్నారా శరీరానికి ప్రమాదమే.. జాగ్రత్త సుమా..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook