Benefits of Coconut water: ఎండా కాలంలో కొబ్బరి నీళ్లు తాగడం వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయా?
Benefits of Coconut water: ఎండా కాలం మెుదలైంది. సూర్యుడు తన ప్రతాపాన్ని చూపించడం మెుదలుపెట్టాడు. దీని కారణంగా చాలా మంది డీహైడ్రేషన్ బారిన పడటం, వడదెబ్బకు గురికావడం జరుగుతుంది. కొబ్బరి నీళ్ల తాగడం వల్ల మీ బాడీలో వేడి తగ్గడమే కాకుండా హెల్త్ కు కూడా ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి.
Coconut water benefits: వేసవిలో కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఈ నీరు ఎన్నో పోషకాలతో నిండి ఉంటుంది. శరీరాన్ని డీహైడ్రేట్ గా ఉంచడంలో కొబ్బరి నీరు సహాయపడుతుంది. అంతేకాకుండా ఈ కొబ్బరి నీళ్లు ఎన్నో వ్యాధులను దూరం చేస్తుంది. కొబ్బరి నీళ్లలో 94 శాతం నీరు ఉంటుంది, కొవ్వు చాలా తక్కువగా ఉంటుంది. కొకోనాట్ వాటర్ లో యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి.ఎండా కాలంలో కొబ్బరి నీరు తాగడం వల్ల ఎన్ని ఆరోగ్యకర ప్రయోజనాలో తెలుసుకుందాం.
కొబ్బరి నీళ్లు ప్రయోజనాలు
** కొబ్బరినీళ్లు జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
** ఇందులో ఎలక్ట్రోలైట్స్, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా మీకు ఎసిడిటీ నుండి ఉపశమనం లభిస్తుంది.
** యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ల నుండి రక్షించడంలో కొబ్బరి నీళ్లు అద్భుతంగా పనిచేస్తాయి.
** బీపీని కంట్రోల్ చేయడంలో కొకోనట్ వాటర్ సూపర్ గా పనిచేస్తుంది.
** కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడేవారు కొబ్బరి నీళ్ల తాగడం మంచిది.
** కొబ్బరినీళ్లు తాగడం వల్ల మీరు డీహైడ్రేషన్ బారి నుండి రక్షింపబడతారు.
** గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో కొబ్బరి నీళ్లు కీలకపాత్ర పోషిస్తాయి.
** కోకోనట్ వాటర్ లో యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఇది మీ రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి.
** కొబ్బరి నీళ్లలో విటమిన్ బి9 ఎక్కువగా ఉంటుంది. ఇది గర్భిణులకు చాలా మంచిది.
** షుగర్ ను కంట్రోల్ చేయడంలో కొకోనట్ వాటర్ బాగా ఉపయోగరంగా ఉంటుంది.
Also Read: Figs Side Effects: అతిగా అంజీర్ పండ్లు తింటున్నారా? అయితే చాలా ప్రమాదం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి