Lemon Benefits: ఈ చిట్కాలు పాటిస్తే..ముఖంపై ముడతలు 3 రోజుల్లో మాయం
Lemon Benefits: ప్రకృతిలో విరివిగా లభించే నిమ్మకాయతో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి. నిమ్మకాయ అనేది ఆరోగ్యంతో పాటు సౌందర్యానికి కూడా అద్భుతంగా పనిచేస్తుందని తెలుసా..
సిట్రస్ ఫ్రూట్స్‌లో కీలకమైంది నిమ్మకాయ. బెస్ట్ ఇమ్యూనిటీ బూస్టర్‌గా నిమ్మకాయను చెప్పవచ్చు. ఇదే నిమ్మకాయతో మీ సౌందర్యాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుకోవచ్చు. ఆ వివరాలు మీ కోసం.
నిమ్మకాయ గురించి అన్ని వైద్య విధానాల్లోనూ కీలకమైన ప్రస్తావన ఉంది. ఆరోగ్యపరంగా అన్ని అద్భుత ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇందులో విటమిన్ సి, విటమిన్ బి, కాల్షియం, ఫాస్పరస్, మెగ్నీషియం, ప్రోటీన్లు, కార్బొహైడ్రేట్లు పుష్కలంగా లభిస్తాయి. ఇన్ని పోషకాలున్నందున నిమ్మకాయ ఆరోగ్య పరిరక్షణ కోసమో అనుకుంటారు అందరూ. అయితే నిమ్మకాయతో సౌందర్యం కూడా ఇనుమడింప చేసుకోవచ్చు. చర్మ సంరక్షణకు నిమ్మకాయను మించింది లేనేలేదు.
సౌందర్య పరిరక్షణలో నిమ్మకాయ
నిమ్మకాయను చాలా రకాలుగా ఉపయోగించవచ్చు. సగం కోసిన నిమ్మకాయలో తేనె కొద్దిగా వేసి ముఖానికి, చేతులు, మెడ, కాళ్లకి రుద్దుకోవాలి. 15 నిమిషాల తరువాత చల్లని నీటితో కడిగేయాలి. ఇలా వారానికి 3-4 సార్లు చేస్తే..చర్మం కాంతివంతంగా మారుతుంది. ముడతలు, నల్లటి మచ్చలు ఉంటే తొలగిపోతాయి. నిమ్మకాయలో ఉండే విటమిన్ సి కొలాజన్ ఉత్పత్తిని పెంచి చర్మాన్ని మృదువుగా, కాంతివంతంగా మారేలా చేస్తుంది.
పళ్లు, పెదాలకు మెరుపు
నిమ్మతొక్కతో పళ్లను రద్దుకుంటే..పళ్లపై ఉండే ఓ విధమైన పసుపురంగు పోతుంది. పళ్లు తెల్లగా మెరుస్తాయి. కేవలం పావు స్పూన్ బేకింగ్ సోడాను నిమ్మరసం కలిపి పళ్లు క్లీన్ చేసుకోవాలి. కొంతమందికి వివిధ కారణాలతో పెదవులు నల్లగా మారుతుంటాయి. రాత్రివేళ పడుకునేముందు..నిమ్మరసం కొద్దిగా తెనె కలిపి రాసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే పెదవులు అందంగా మారుతాయి.
ముఖంపై మొటిమల సమస్య మహిళలను చాలా ఇబ్బంది పెడుతుంటుంది. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందేందుకు నిమ్మరసాన్ని మొటిమలపై క్రమం తప్పకుండా కొన్ని రోజులపాటు రాసుకోవాలి. పది నిమిషాల తరువాత చల్లని నీళ్లతో కడగాలి. నిమ్మలో ఉండే ఆస్కార్బిక్ యాసిడ్ మొటిమల్ని దూరం చేస్తుంది. యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు తిరిగి రాకుండా చేస్తాయి. మృదువైన చర్మం కోసం ఒక టీ స్పూన్ ఆరెంజ్ జ్యూస్‌లో ఒక టీ స్పూన్ నిమ్మరసం కలిపి..అందులో నిమ్మ తొక్క పొడి కూడా కొద్దిగా కలుపుకోవాలి. ఈ పేస్ట్‌ను ముఖానికి రాసుకుని ఓ అరగంట తరువాత చల్లనినీళ్లతో కడగాలి.
బొప్పాయి, నిమ్మకాయతో
ఇటీవలి కాలంలో ముఖంపై ముడతల సమస్య ఎక్కువైంది. ముడతల నిర్మూలనకు బొప్పాయి రసంలో నిమ్మ తొక్క పొడి కలుపుకుని రాసుకోవాలి. ఓ అరగంట తరువాత నీళ్లతో కడిగేయాలి. ఇలా తరచూ చేస్తే ముడతలు పోవడమే కాకుండా నిత్య యవ్వనంగా కన్పిస్తారు.
Also read: Diabetes: దీపావళీ రోజున మధుమేహం ఉన్నవారు కూడా స్వీట్స్ తినొచ్చు.. ఎలాగో తెలుసా..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook