Lemon Oil For Hair Growth: నిమ్మ నూనెను నిమ్మ తొక్కలతో తయారుచేస్తారు. వీటిని డైరెక్ట్ గా జుట్టుకు అప్లై చేయడం వల్ల దురద వంటి సమస్యలు తగ్గిపోతాయి. అంతేకాదు వీటిని ఆ రోజ్మెరీ, కొబ్బరి నూనె వంటి ఆయిల్స్ కూడా కలిపి అప్లై చేయవచ్చు. దీంతో కుదుళ్ల సమస్యలు తగ్గిపోతాయి. ఇన్ఫెక్షన్ సమస్యకు కూడా ఇది ఎఫెక్టీవ్‌గా పనిచేస్తుంది. ఇది జుట్టుపై బ్యాక్టిరియా, ఫంగస్ పెరగకుండా కాపాడుతుంది. నిమ్మ నూనెలో యాంటి ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది ట్రీ ఆయిల్ తో కలిపి జుట్టుకు అప్లై చేయడం వల్ల డబుల్ బెనిఫిట్స్ పొందుతారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నిమ్మనూనెతో కలిగే ప్రయోజనాలు ఇందులో యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ మైక్రోబియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇవి జుట్టుకు కండిషనర్ల పని పనిచేస్తాయి. వివిధ హెయిర్ మాస్కులు కూడా విటమిన్స్ ఉపయోగించవచ్చు. సింపుల్‌గా ఇంట్లోనే లెమన్ ఆయిల్ ని మనం వాడుకోవచ్చు. వారానికి రెండు సార్లు ఈ లెమన్ ఆయిల్ ని వాడటం వల్ల జుట్టు పెద్దగా పెరుగుతుంది.


ఆముదం లేదా ఆలివ్ ఆయిల్ తో కలిపి పెట్టుకోవడం వల్ల జుట్టు పెద్దగా పెరగడమే కాకుండా హెయిర్ ఫాల్ సమస్య కూడా తగ్గిపోతుంది. ఎందుకంటే ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది ఆముదంతో కలపడం వల్ల బ్లడ్ సర్కులేషన్ మెరుగవుతుంది. జుట్టుకు జీవం అందించి డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది దీంతో స్ల్పింట్‌ ఎండ్ సమస్యలు కూడా రావు. ఆలివ్ ఆయిల్ లో విటమిన్స్ ఉండటం వల్ల ఇవి జుట్టు పెరుగుదలను ప్రేరేపిస్తాయి. ఇవి జుట్టుకు పోషకాన్ని అందించి హెయిర్ ఫాలికల్స్ కాకుండా బలంగా మారుస్తాయి. రెండు టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ ఆముదం, ఐదు చుక్కల లెమన్ జ్యూస్ వేసి హెయిర్ మాస్క్ ల అప్లై చేయాలి.


ఇదీ చదవండి:  రాఖీ పౌర్ణమి ప్రత్యేక మెహందీ చిత్రాలు.. నిమిషంలో వేసుకునే రక్షాబంధన్‌ డిజైన్స్‌..


మీకు ఎక్కువ సమయం లేకపోతే మామూలుగా లెమన్ జ్యూస్ నేరుగా జుట్టుకు అప్లై చేయవచ్చు. ఇలా చేయడం వల్ల కూడా జుట్టు పెరుగుతుంది కొబ్బరి నూనెతో కలిపి జుట్టుకు అంతటికి ఈ లెమన్ ఆయిల్ ని అప్లై చేయాలి. ఇందులో ఫైబర్, విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది జుట్టు క్వాలిటీని పెంచి జుట్టు పెరుగుదలకు ప్రోత్సహిస్తుంది. వారంలో ఒక్కసారైనా ఈ మాస్క్ అప్లై చేయాలి. దీనికి రెండు నిమ్మకాయలు తీసుకుంటే సరిపోతుంది.


ఇదీ చదవండి: పెరుగుతున్న దోమలు.. మీ పిల్లల్ని 6 విధాలుగా  రక్షించుకోండి..


కరివేపాకులతో కూడా జుట్టు పెద్దగా పెరుగుతుంది. అంతేకాదు ఇది వైట్‌ హెయిర్ సమస్య రాకుండా నివారిస్తుంది ఎందుకంటే ఇందులో విటమిన్ b6, క్యాల్షియం, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్స్‌ ఉంటుంది. ఇది జుట్టుకు మంచి పోషకాన్ని అందించి కుదుళ్ల ఇన్ఫెక్షన్ బారిన పడకుండా కాపాడుతుంది. ఫ్రీ రాడికల్ సమస్యలు నివారిస్తుంది వారంలో రెండు సార్లు కరివేపాకు నిమ్మ రసంలో కలిపి జుట్టుకు అప్లై చేయడం వల్ల మెరుగైన ఫలితాలు లభిస్తాయి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో హెయిర్ వాష్ చేసి షాంపూ చేయాలి. దీంతో జుట్టు బలంగా ఆరోగ్యంగా పెరుగుతుంది కరివేపాకును పేస్టు మాదిరి చేసి అందులో నిమ్మరసం వేసి జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు అప్లై చేయాలి దీంతో జుట్టు ఆరోగ్యంగా మెరుస్తుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు) 
 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter