Lemon Water For Liver Disease: జీవనశైలిలో మార్పులు రావడం వల్ల చాలామంది నిత్యం అనారోగ్య సమస్యలకు గురవుతూ ఉంటారు. ముఖ్యంగా వాతావరణంలోని కాలుష్యం కారణంగా చాలామంది ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నారు అంతేకాకుండా జుట్టు చర్మ సమస్యలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. ఈ ఊపిరితుల సమస్యలు రావడానికి వాతావరణ కాలుష్యం ఓ ప్రధాన కారణమైతే ధూమపానం మద్యపానం వంటి వ్యసనాలు కూడా ఈ సమస్యలకు ప్రధాన కారణాలేనని ఆరోగ్య నిపుణులు భావిస్తున్నారు. ఒక్కసారి ఊపిరితిత్తుల సమస్య బారిన పడితే అది శరీరంలో దీర్ఘకాలిక వ్యాధిగా మారుతుంది. దీంతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కొందరి లోనైతే క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధులు కూడా రావచ్చని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ సమస్యలు ఉన్నవారు మార్కెట్లో లభించే చాలా రకాల ఉత్పత్తులను వినియోగిస్తున్నారు అయినప్పటికీ ఎలాంటి ఫలితాలను పొందలేకపోతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి సహాసిద్ధమైన మూలికలతో కొన్ని చిట్కాలు పాటించాల్సి ఉంటుంది. వీటిని క్రమం తప్పకుండా పాటిస్తే ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన వ్యర్ధాలు అన్ని సులభంగా తొలగిపోయి శుభ్రంగా మారి ఊపిరితిత్తుల సమస్యలనుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది.



అయితే ఊపిరితిత్తుల సమస్యలనుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఆయుర్వేద నిపుణులు సూచించిన అల్లంతో తయారుచేసిన డికాషన్ ని తాగాల్సి ఉంటుంది. దీనిని తయారు చేసుకోవడానికి మొదటగా ఒక బౌల్లో రెండు కప్పుల నీటిని తీసుకొని అందులో ఒక టీ స్పూన్ అల్లం పేస్ట్ ను వేసి బాగా మరిగించాలి. ఇలా మరిగించిన తర్వాత రెండు టీ స్పూన్ల పసుపును వేసి మళ్లీ రెండు నిమిషాల పాటు మరిగించాలి. ఇలా మరిగిన పాన్యాన్ని వడకట్టుకొని ఉదయం పూట ఖాళీ కడుపుతో తాగితే అనారోగ్య సమస్యలన్నీ సులభంగా దూరమవుతాయి.


ఊపిరితిత్తులలో వ్యర్ధాలు తొలగిపోవడానికి నిమ్మకాయతో చేసిన పానీయం కూడా చాలా ఉపయోగపడుతుంది. అయితే ఈ పానీయాన్ని తయారు చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్ లో ఒక కప్పు నీటిని తీసుకొని అందులో ఒక టీ స్పూన్ ల నిమ్మకాయ రసం వేసి బాగా మరిగించాలి. ఆ తర్వాత అందులో రెండు టేబుల్ స్పూన్ల తేనెను వేసి మళ్లీ మరిగించాలి. ఆ తర్వాత దానిని వడకట్టుకొని టీలా తాగితే శరీరంలోని వ్యర్ధాలు అన్ని సులభంగా తొలగిపోతాయి.


Also Read: Tabassum Govil Death: సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం.. మరణించిన వార్త బయట పెట్టొద్దని మాట తీసుకున్న నటి?


Also Read: Allu Aravind Supports Dil Raju: దిల్ రాజుకు అల్లు అరవింద్ సపోర్ట్.. అసలు అది జరగదంటూ కామెంట్స్!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook