Methi Ladoo Benefits: మెంతులు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. అంతేకాకుండా కీళ్ల నొప్పులు, వెన్నునొప్పి వంటి సమస్యలు తగ్గుతాయి.  మెంతుల్లో ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ మెంతులతో లడ్డూలు కూడా తయారు చేసుకొని తినవచ్చు. మెంతుల లడ్డు ఎలా తయారు చేసుకోవాలి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

లడ్డకు తయారికి కావాలసిన పదార్థాలు: 


వంద గ్రాముల మెంతులు, అర లీటరు పాలు, మూడు వందల గ్రాముల గోధుమ పిండి, నెయ్యి, బాదం పలుకులు, ఎండుమిర్చి, జీలకర్ర పొడి రెండు టీస్పూన్లు, అల్లం పొడి రెండు టీస్పూన్లు, యాలకుల పొడి, దాల్చిన చెక్క నాలుగు ముక్కలు, జాజికాయ రెండు, బెల్లం మూడు వందల గ్రాములు. 


Also read: Diabetes: కాకరకాయ రసాన్ని ప్రతిరోజూ తగడం వల్ల షుగర్ కంట్రోల్ !


లడ్డు తయారు చేసుకోండి ఇలా:


ముందుగా మెంతులను శుభ్రం చేసుకోవాలి. తర్వాత ఎండలో ఆరబెట్టాలి. వీటిని మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. ఇందులోకి పాలు కలుపుకొని పేస్ట్‌లా తయారు చేసుకోవాలి. తరువాత బాదంపప్పు ముక్కలు, ఎండుమిర్చి, పప్పు చక్కెర, జాజికాయ ఏలకుల పొడిగా చేసుకోవాలి.  ఇప్పుడు బాణలిలో  నెయ్యి వేసి నానబెట్టిన మెంతుల పేస్ట్‌ను గోధుమరంగు వచ్చేవరకు వేయించాలి. తరువాత పాన్లో నెయ్యి వేసి, బెల్లం ముక్కలను వేసి, వాటిని కరిగించాలి. తరువాత  జీలకర్ర పొడి, పొడి అల్లం పొడి, తరిగిన బాదం, ఎండుమిర్చి, దాల్చిన చెక్క, జాజికాయ, యాలకులు వేసి బాగా కలపాలి. చివరగా మెంతిపేస్ట్‌, వేయించిన పిండిని కలపాలి. మెంతులు, వేయించిన పిండి మిశ్రమాన్ని చేతులతో బాగా కలపాలి. తర్వాత చిన్న ఉండలు చేసుకోవాలి ఇలా లడ్డు రెడీ చేసుకోవాలి.


Also read: Bhogi Pallu 2024: భోగి పండగ రోజే పిల్లలకు భోగి పండ్లను ఎందుకు పోస్తారు? ఇది తెలిస్తే తప్పకుండా మీ పిల్లలకు కూడా పోస్తారు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter