Lemon Water Benefits: ఇంట్లో ఏడాది పొడవునా లభించే వాటిల్లో నిమ్మకాయ కూడా ఒకటి. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. నిమ్మకాయ రసం తీసుకోవడం వల్ల ఎన్నో వ్యాధులు దూరమవుతాయి. ఇది శరీరానికి తక్షణమే శక్తిని ఇస్తుంది.  వేడి నీటిలో నిమ్మకాయ రసం పిండుకుని తాగడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నిమ్మకాయ రసం ప్రయోజనాలు
** బాడీని హైడ్రేట్‌గా ఉంచటంలో నిమ్మకాయ రసం కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా ఇది శరీరాన్ని రిఫ్రెష్ గా ఉంచుతుంది. 
** ఇది వర్క్ ఫ్రం హోం వారికి దివ్యౌషధమనే చెప్పాలి. ఒకే చోట గంటల తరబడి లేవకుండా కూర్చోవటంతో వచ్చే ఒబేసిటీకి ఇది చెక్ పెడుతుంది.
** నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది మీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అంతేకాకుండా ఇన్ఫెక్షన్లు గురికాకుండా ఉంటారు. 
** నిమ్మ రసం తాగడం వల్ల మీ జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అంతేకాకుండా అజీర్తీ, మలబద్ధకం వంటి సమస్యలు దూరమవుతాయి.
** చర్మానికి నిగారింపు ఇవ్వడంతోపాటు స్కిన్ ను కాంతివంతంగా చేయడంలో నిమ్మ రసం అద్భుతంగా పనిచేస్తుంది.  
** నిమ్మలో యాంటీ ఏజింగ్‌ లక్షణాలు ఉంటాయి. ఇవి మీకు చిన్న వయస్సులో ముడతలు రాకుండా నివారిస్తుంది. 
** నిమ్మకాయలో ఉన్న సిట్రిక్ యాసిడ్ మూత్రపిండాల్లోని రాళ్లను సైతం కరిగించగలదు. 


Also Read: Dark Circles: కంటి కింద డార్క్ సర్కిల్స్ సమస్యను సులభంగా ఇలా పరిష్కరించుకోండి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook