Litchi Face Mask: లిచీ ఆరోగ్యానికి ఎంత మంచివో అందరికీ తెలిసిందే..అయితే ఇందులో ఉండే గుణాలు చర్మ సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం కలిగిస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో చర్మాన్ని సంరక్షించే చాలా రకాల పోషకాలు లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజు వీటిని వినియోగించడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా వేసవిలో చర్మ సమస్యలతో  బాధపడేవారు ప్రతి రోజు లిచీని ఫేస్ స్క్రబ్, ఫేస్ మాస్క్ గా వినియోగించడం వల్ల చర్మ సమస్యలు దూరవుతాయి. ముఖ్యంగా పిగ్మెంటేషన్, మొటిమలు, పొడి చర్మం సమస్యల నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుందని సౌందర్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఫేస్ స్క్రబ్, ఫేస్ మాస్క్ ఎలా వినియోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

లిచీతో ఈ ఫేస్ ప్యాక్‌లను తయారు చేసుకోవచ్చు:
లిచీ, చందనం ఫేస్ ప్యాక్‌:

లిచీ, చందనం ఫేస్ ప్యాక్‌ కూడా వేసవిలో చర్మ సమస్యలను తగ్గించేందుకు సహాయపడుతుందని సౌందర్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు పొడి చర్మం సమస్యలను తగ్గించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. ఈ ఫేస్‌ ఫ్యాక్‌ను తయారు చేసుకోవడానికి ముందుగా..4 నుంచి 5 లీచీలను పేస్ట్ చేయండి. అందులో రెండు చెంచాల గంధపు పొడి, అర చెంచా పసుపు వేసి మిశ్రంలా తయారు చేయండి. ఇలా తయారు చేసిన తర్వాత ముఖానికి అప్లై చేసి 30 నిమిషాల పాటు అలానే ఉంచి..ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. 


లిచీ, హనీ ఫేస్ ప్యాక్‌:
లిచీ, హనీ ఫేస్ ప్యాక్‌ కూడా అన్ని రకాల చర్మ సమస్యలను తగ్గించేందుకు సహాయపడతుందని సౌందర్య నిపుణులు తెలుపుతున్నారు. దీని కోసం ఒక గిన్నెలో రెండు చెంచాల అలోవెరా జెల్, ఒక చెంచా తేనె  వేసి బాగా మిక్స్‌ చేయాలి. ఆ తర్వాత లిచీ జ్యూస్, అర చెంచా పసుపు వేసి బాగా మిక్స్‌ చేయాలి. ఇలా మిక్స్‌ చేసిన తర్వాత ముఖానికి అప్లై చేస్తే మంచి ఫలితాలు పొందుతారు. తేనెలో ఉండే యాంటీఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్, యాంటీ మైక్రోబియల్ లక్షణాలు చర్మాన్ని తేమగా ఉంచేందుకు సహాయపడుతుంది.


లిచీ, నిమ్మకాయ ఫేస్‌ ఫ్యాక్‌:
ఈ ఫేస్‌ ఫ్యాక్‌ను తయారు చేయడానికి ముందుగా మూడు నుండి నాలుగు లిచీలను తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత వాటి నుంచి గుజ్జును తీసి.. నిమ్మకాయ రసం వేసి.. రెండింటినీ బాగా కలపాలి. ఇలా కలిపి తర్వాత ముఖానికి అప్లై చేసి.. 15 నుంచి 20 నిమిషాల తర్వాత ఈ ప్యాక్  నీటితో కడిగేయండి. ఇలా క్రమం తప్పకుండా అప్లై చేయడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా  పిగ్మెంటేషన్ సమస్యలు కూడా దూరమవుతాయని సౌందర్య నిపుణులు తెలుపుతున్నారు. 


లిచీ ఫేస్ ప్యాక్ వల్ల కలిగే ప్రయోజనాలు:
లిచీ ఫేస్ ప్యాక్‌తో చర్మం ముడతల సమస్యలు దూరమవుతాయి.
ఇందులో ఉండే గుణాలు ముడతలను తొలగించడానికి సహాయపడతాయి.
దీంతో ట్యానింగ్ సమస్య కూడా తొలగిపోతుంది.
డ్రై స్కిన్‌ సమస్యలను తగ్గించేందుకు సహాపడతాయి.
లిచీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని దెబ్బతినకుండా కాపాడతాయి.


Also read: Herbal Plant: ఈ ఒక్క మొక్క చాలు కేన్సర్ సహా 5 ప్రాణాంతక వ్యాధులకు చెక్ చెప్పవచ్చు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook