Healthy Lifestyle: నూరేళ్లు జీవించాలంటే... మీ ఆహారంలో ఈ చిన్న మార్పులు చేసుకోండి!
Tips for Healthy Lifestyle: దీర్ఘాయువు మరియు ఆరోగ్యకరమైన జీవితం అనేది ప్రతి ఒక్కరి కోరిక. అటువంటి పరిస్థితిలో, దానిని సాధించే మార్గాలను తెలుసుకుందాం. వాస్తవానికి ఇది మన ఆహారం మరియు మన దినచర్యపై ఆధారపడి ఉంటుంది. మనం ఏమి తినాలి, ఏమి తినకూడదు ఇప్పుడుతెలుసుకుందాం.
Healthy lifestyle tips for long Life: మీరు నూరేళ్లు ఆరోగ్యంగా జీవించాలనుకుంటున్నారా? అయితే అది మీ చేతుల్లోనే ఉంది. ముందుగా మీకు ఏది తినాలో మరియు ఏది తినకూడదో తెలుసుండాలి. ఎందుకంటే మీకు దీర్ఘాయువు (Long Life), ఆరోగ్యకరమైన జీవితం కావాలంటే ఇది తెలుసుండటం ముఖ్యం. ఎలాంటి ఆహారం తీసుకుంటే ఎక్కువ సంవత్సరాలు బతుకుతాం అనే విషయంపై కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన ఇద్దరు ప్రోఫెసర్లు పరిశోధన చేశారు. వీరి రీసెర్చ్ ప్రకారం, ఆహారం ఒకటే కాదు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటే గానీ దీర్ఘాయుష్షుతో పాటు రోగాలు లేకుండా జీవించలేం. ఎన్ని కేలరీల ఆహారం తీసుకోవాలి? ఉపవాసం ఎందుకు ఉండాలి? అనే విషయాలపై ఇప్పుడు చర్చిద్దాం.
దీర్ఘాయువు కోసం ఏమి తినాలి?
మీ డైట్‌లో (Diet) మీడియం నుండి అధిక మొత్తంలో కార్బోహైడ్రేట్లు ఉండేలా చూసుకోండి. శరీరానికి అవసరమైనంత మాత్రమే ప్రోటీన్ తీసుకోండి. ఈ ప్రోటీన్‌లో ఎక్కువ భాగం మొక్కలు, చెట్ల నుండి లభించే ఆహారం మాత్రమే ఉండాలి. అదేవిధంగా పప్పుధాన్యాలు, కూరగాయలు, కొంత మెుత్తంలో చేపలు మీ ఆహారంలో చేర్చుకోవాలి. తక్కువ మెుత్తంలో చక్కెర తీసుకోండి. జీడిపప్పు, బాదం, వాల్‌నట్స్ వంటి డ్రై ఫ్రూట్స్‌ను అధిక పరిమాణంలో తీసుకోవాలి. కొంత మొత్తంలో డార్క్ చాక్లెట్‌ను కూడా ఆహారంలో చేర్చుకుంటే మంచిది.
ఉపవాసం కూడా అవసరం
ఉదయం 12 గంటలలోపు మీరు ఆహారం తినాలి. మిగతా 12 గంటలు ఉపవాసం (Fasting) చేయండి. ఇలా చేయడం ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రతి 3-4 నెలలకు 5 రోజులు ఉపవాసం చేయడం ద్వారా, మీరు వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించవచ్చు.
నిపుణుల సూచనల మేరకే...
ఈ రీసెర్చ్‌లో ఏం తినాలి అని చెప్పారు కానీ ఎంత తినాలి అనేది మాత్రం చెప్పలేదు. అందుకే ఏ వ్యక్తి అయినా తన ఆరోగ్యం, వయస్సును దృష్టిలో ఉంచుకుని పుడ్ తీసుకోవాలి. ప్రతి వ్యక్తి డైటీషియన్ పర్యవేక్షణలో మాత్రమే ఈ ఆహారాన్ని తినేలా ప్లాన్ చేసుకోవాలి.
Also Read: Baldness Problem: మీ జుట్టు రాలుతూ బట్టతలగా మారుతోందా..ఇలా చేస్తే బట్టతల మాయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.