Magic Mushroom Side Effects: పుట్టగొడుగులు శరీరానికి చాలా పోషకాలను అందిస్తాయి. ఇవి ఖరీదైనప్పటికీ అందుకే చాలామంది వీటిని అతిగా తినేందుకు ఇష్టపడుతుంటారు. క్రమం తప్పకుండా ఆహారంగా తీసుకుంటే శరీరానికి విటమిన్లు B, D, పొటాషియం, కాపర్, ఐరన్, సెలీనియం పుష్కలంగా లభిస్తాయి. అయితే మార్కెట్లో పుట్టగొడుగులు చాలా రకాలుగా లభిస్తాయి. అందులో మంచి చెడు రెండు రకాలుగా ఉంటాయి. మార్కెట్లో లభించే చెడు పుట్టగొడుగులు తినడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు రావచ్చు. చాలామంది మార్కెట్లో చెడు మంచి పుట్టగొడుగులకు తేడా తెలియకుండా ఎక్కువగా చెడు పుట్టగొడుగులనే తింటున్నారు. వాటిని తినడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సమస్యలలో బాధపడుతున్న వారు పుట్టగొడుగులను తినవద్దు:


1. అజీర్ణం:
తరచుగా మార్కెట్లో లభించే చెడు పుట్టగొడుగులను ఆహారంగా తీసుకోవడం వల్ల పొట్టలోని తీవ్ర సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీనివల్ల కడుపులో మంట, అజీర్ణం, మలబద్ధకం, విరేచనాలు వంటి సమస్యలే కాకుండా దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి వాటిని తీసుకునే ముందు తప్పకుండా ఒకటికి రెండుసార్లు పరీక్షించాల్సి ఉంటుంది.


2. చర్మ సమస్య:
పుట్టగొడుగులను తినడం వల్ల కొందరిలో చర్మ సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. దీనివల్ల చర్మంపై దద్దుర్లు, చర్మంపై చికాకు, అలర్జీ వంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీటిని అతిగా తీసుకోకపోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.


3. తరచుగా అలసటతో బాధపడేవారు వీటిని తినొద్దు:
తరచుగా అలసట నీరసం వంటి సమస్యలతో బాధపడుతున్న వారు పుట్టగొడుగులను అతిగా తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందులో ఉండే కొన్ని మూలకాలు తీవ్ర అనారోగ్య సమస్యలను తెచ్చిపెట్టే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీటిని ఆహారంలో తీసుకోకపోవడం చాలా మంచిది.


(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)


Also Read : Nandamuri Balakrishna : దిల్ లేని రాజు.. దిల్ రాజు.. బాలయ్య పంచ్‌లు


Also Read : Jabardasth Sri Satya : పొట్టి డ్రెస్సులో జబర్దస్త్ బ్యూటీ.. కొత్త లుక్కులో సత్య శ్రీ అదుర్స్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook