Marigold Flower Benefits: చర్మంపై తక్షణమైన గ్లో కోసం బంతి పూలను ఇలా ఉపయోగించండి..
Marigold Flower Benefits For Skin: ప్రస్తుతం చాలామంది చర్మ సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి చర్మ వైద్య నిపుణులు సూచించిన ఈ చిన్న చిట్కాలను వినియోగించండి. దీనిని వినియోగించడం వల్ల చర్మ సమస్యలతో పాటు ఇతర అనారోగ్య సమస్యల నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు.
Marigold Flower Benefits For Skin: భారతీయులంతా ఎక్కువగా పూలను ఇష్టపడుతూ ఉంటారు. అంతేకాకుండా వాటిని పవిత్రమైన వస్తువులుగా భావిస్తారు. ముఖ్యంగా వీటిని పూజా కార్యక్రమంలో అతిగా వినియోగిస్తూ ఉంటారు. అయితే ఇందులో శరీరానికి కావలసిన చాలా రకాల గుణాలుంటాయని అందరికీ తెలిసిందే. వీటిని సౌందర్య లేపనాలకు వినియోగించడమే కాకుండా చర్మ సమస్యల నుంచి ఉపశమనం పొందేందుకు కూడా ఉపయోగిస్తారని ఆయుర్వేద శాస్త్రంలో పేర్కొన్నారు.
ముఖ్యంగా చర్మ సమస్యల నుంచి ఉపశమనం కలిగించేందుకు బంతిపూలు ప్రధాన పాత్ర పోషిస్తాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే గుణాలు చర్మాన్ని అందంగా తయారు చేసేందుకు సహాయపడతాయి. అయితే చర్మ సౌందర్యం కోసం, రక్షణ కోసం బంతి పువ్వు సహాయపడుతుందని దీనిని తరచుగా చర్మానికి వినియోగించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారని చర్మ వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ బంతిపూలను చర్మానికి ఎలా వినియోగించాలో.?, వీటివల్ల చర్మానికి కలిగే ప్రయోజనాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
మేరిగోల్డ్ ఫ్లవర్ చర్మాన్ని ఎక్కువ కాలం యవ్వనంగా ఉంచుతుంది:
బంతి పువ్వుతో తయారుచేసిన మిశ్రమాన్ని చర్మానికి అప్లై చేసుకుంటే చర్మాన్ని ఎక్కువ కాలం యవ్వనంగా ఉంచేందుకు సహాయపడుతుందని చర్మ నిపుణులు చెబుతున్నారు. ఈ బంతి పువ్వులో అధిక పరిమాణంలో గ్లైకోప్రొటీన్లు లభిస్తాయి. కాబట్టి చర్మ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందేందుకు సహాయపడుతుంది. ముఖ్యంగా చర్మ సమస్యలు రాకుండా చర్మాన్ని రక్షిస్తుంది.
చర్మాన్ని తేమగా ఉంచడానికి సహాయపడుతుంది:
చర్మంపై గ్లో వచ్చేందుకు మార్కెట్లో లభించే చాలా రకాల స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ ను వినియోగిస్తున్నారు.. కానీ ఎలాంటి ఫలితాలు పొందలేకపోతున్నారు. చర్మం పై గ్లో తెచ్చుకునేందుకు బంతిపూలు కూడా సహాయపడతాయని చాలామందికి తెలియదు. ఇందులో ఉండే గుణాలు చర్మానికి చాలా రకాల ప్రయోజనాలను చేకూరుస్తాయి. దీంతో తయారు చేసిన మిశ్రమాన్ని చర్మానికి అప్లై చేస్తే చర్మం పై గ్లో దానంతకదే వస్తుంది. ముందుగా మీ శ్రమను తయారు చేసుకోవడానికి బంతిపూల రేకులను నీటిలో ఉడకబెట్టాలి. అలా ఉడకబెట్టిన రేకులను వడకట్టి మిశ్రమంల రుబ్బుకోవాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని క్రమం తప్పకుండా వినియోగించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.
Also Read : Anasuya Bharadwaj White Dress : బొడ్డు చూపిస్తున్న జబర్దస్త్ బ్యూటీ.. తెలుపు దుస్తుల్లో అనసూయ అందాలు
Also Read : Anasuya Bharadwaj White Dress : బొడ్డు చూపిస్తున్న జబర్దస్త్ బ్యూటీ.. తెలుపు దుస్తుల్లో అనసూయ అందాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook