Matsyasana Benefits: ప్రస్తుత చాలా మంది బిజీ లైఫ్ స్టైల్ కారణంగా వివిధ రకాల ఆహారాలను తీసుకుంటున్నారు. దీని వల్ల తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారని నిపుణులు తెలుపుతున్నారు. అయితే శరీర అభివృద్ధికి తప్పకుండా పోషకాలు ఆహారాలను తీసుకోవాల్సి ఉంటుంది. దీని వల్ల శరీరం అభివృద్ధి చెందడమే కాకుండా అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి. అయితే ఇదే క్రమంలో చాలా మంది శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా చాలా మంది మలబద్ధకం, గ్యాస్, అపానవాయువు, అసిడిటీ సమస్యల బారిన పడడం విశేషం. ఈ సమస్యల కారణంగా ఊపిరి ఆడకపోవటం వంటి సమస్యలు వస్తున్నాయి. కాబట్టి ఈ వ్యాధులకు చెక్‌ పెట్టేందుకు యోగా చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. యోగా చేయడం వల్ల శరీరం దృఢంగా అవ్వడమేకాకుండా మంచి ప్రయోజనాలు చేకూరుతాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 శ్వాస ఇబ్బందులకు యోగాసనాలు:
కడుపు నొప్పి, శ్వాస ఆడకపోవడం వంటి సమస్యలకు వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది. దీని కోసం మత్స్యాసనాలు కూడా చేయాల్సి ఉంటుంది. ఈ ఆసనాలను క్రమం తప్పకుండా వేయడం వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా పై సమస్యలు కూడా దూరమవుతాయి.


ఈ ఆసనాలను ఎలా వేయాలి:
>>మొదట యోగా కోసం ఉపయోగించే చాపను వేసి.. ఆపై యోగా చేయడానికి దానిపై కూర్చోండి.
>>ఇప్పుడు దానిపై పడుకుని.. రెండు కాళ్లను రివర్స్ సైడ్‌లో వంచి,  ఇదే క్రమంలో మీ తుంటి కింద ఉంచండి.
>>ఇప్పుడు నెమ్మదిగా ఊపిరి పీల్చుకుంటూ.. ఛాతీని, తలను పైకి ఎత్తండి. ఈ సమయంలో, తల పైభాగాన్ని నేలతో తాకండి.
>>ఈ యోగా ఆసనం క్రమం తప్పకుండా చేయడం వల్ల  పారాథైరాయిడ్, పీనియల్, పిట్యూటరీ గ్రంథులపై ప్రభావవం కలుగుతుంది.
>>ఈ ఆసనం ద్వారా వెన్ను, మెడ కండరాలు బలపడతాయి.


(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, దయచేసి యోగా నిపుణుడిని సంప్రదించండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)


 


Also Read: Telugu Movies this Week: ఈ వారం థియేటర్లో, ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాలివే!


Also Read: Amala Paul on Tollywood: టాలీవుడ్ పై షాకింగ్ కామెంట్స్.. నెపోటిజం, రొట్ట సినిమాలు అంటూ



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి