Benefits Of Micro Breaks: మీరు టీవీలో విన్నట్లుగా చిన్న బ్రేక్ లు చాలా ముఖ్యమైనవి. కానీ నిజానికి మన జీవితంలో చిన్న విరామం చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. చాలా మంది వారం పాటు పని చేసి వారాంతాల్లో విశ్రాంతి తీసుకుంటే చాలు అనుకుంటారు. కానీ నిపుణులు ప్రకారం పెద్ద పెద్ద విరామాల కంటే చిన్న చిన్న విరామాలు తీసుకోవడం మంచిది. ఎందుకంటే చిన్న విరామాలు మనల్ని ఒత్తిడి, డిప్రెషన్ నుంచి బయటపడేలా చేస్తాయి. "మైక్రో బ్రేక్" అని పిలువబడే ఈ చిన్న విరామాలు మనల్ని రీఛార్జ్ చేస్తాయి. మన ఫోకస్, స్టామినాను పెంచుతాయి. ఈ మైక్రో బ్రేక్‌లు మన ఆరోగ్యానికి ఎలాంటి అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మనం తరచుగా పనిలో మునిగిపోయి చిన్న చిన్న విరామాలు తీసుకోవడం మరచిపోతుంటాం. కానీ ఈ మైక్రో బ్రేక్‌లు మన శారీరక, మానసిక ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనవి. ఇంతకి..


మైక్రో బ్రేక్ అంటే ఏమిటి?


మైక్రో బ్రేక్ అంటే 10 నిమిషాలు లేదా అంతకంటే తక్కువ సమయం పాటు తీసుకునే చిన్న విరామాలు. ఈ విరామాల సమయంలో మీ పని నుంచి పూర్తిగా దూరంగా ఉండి, మీ మనసును రిలాక్స్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల బోలెడు ఆరోగ్యలాభాలు కలుగుతాయి. 


మైక్రో బ్రేక్‌ల ప్రయోజనాలు:


పని ఒత్తిడికి గురైనప్పుడు, మైక్రో బ్రేక్‌లు మన మెదడును రిఫ్రెష్ చేసి, ఒత్తిడి స్థాయిలను తగ్గిస్తాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. అలాగే నిరంతరం ఒకే పనిపై దృష్టి పెట్టడం వల్ల మన మెదడు అలసిపోతుంది. ఈ సమయంలో మైక్రో బ్రేక్‌లు మనకు మళ్లీ ఫోకస్ చేయడానికి సహాయపడతాయి.చిన్న చిన్న విరామాలు తీసుకోవడం వల్ల మనం ఎక్కువ సేపు పని చేయగలము మరింత ఉత్పాదకంగా ఉండగలము.


మైక్రో బ్రేక్‌లు మన మెదడును రిలాక్స్ చేసి, కొత్త ఆలోచనల చేయగలిగే శక్తి ఇస్తాయి. దీని వల్ల సృజనాత్మకత పెరుగుతుంది. ఎక్కువసేపు కూర్చోవడం వల్ల శరీరానికి అనేక ఇబ్బందులు కలుగుతాయి. మైక్రో బ్రేక్‌లు మనల్ని లేచి నిలబడేలా చేస్తాయి, కదలడానికి ప్రోత్సహిస్తాయి. దీని వల్ల రక్తప్రసరణ మెరుగుపడుతుంది. కండరాల నొప్పులు తగ్గుతాయి. మైక్రో బ్రేక్‌లు మన మానసిక స్థితిని మెరుగుపరచడంలో సహాయపడతాయి. తీవ్రమైన ఒత్తిడి, ఆందోళన నిద్రలేమి సమస్యలకు దారితీస్తాయి. కానీ మైక్రో బ్రేక్‌లు రోజంతా ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. దీని వల్ల రాత్రిపూట మెరుగ్గా నిద్రపోతారు.



మైక్రో బ్రేక్‌లను ఎలా తీసుకోవాలి:


మీ పనిలో ప్రతి గంటకు ఒకసారి 5 నుండి 10 నిమిషాల మైక్రో బ్రేక్ తీసుకోండి.
ఈ సమయంలో, మీ పని నుండి పూర్తిగా దూరంగా ఉండండి.
నడవండి, కిటికీ వైపు చూడండి, సంగీతం వినండి, స్నేహితులతో మాట్లాడండి లేదా ధ్యానం చేయండి.
మీ శరీరాన్ని వినండి. మీకు అలసటగా లేదా ఒత్తిడిగా అనిపిస్తే, మైక్రో బ్రేక్ తీసుకోండి.


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి