Milk During Monsoon: వానా కాలంలో పాలు, పెరుగును అతిగా తీసుకుంటున్నారా, ఏం జరుగుతుందో తెలుసా?
Avoid Milk And Curd In Monsoon: ప్రస్తుతం చాలా వానా కాలంలో తిన కూడని ఆహారాలు తింటున్నారు. అయితే ఇలా తీసుకోవడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు రావచ్చని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఈ కింది ఆహారాలకు దూరంగా ఉండాల్సి ఉంటుంది.
Avoid Milk And Curd In Monsoon: భారతదేశ వ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్నాయి. దీని కారణంగా వాతావరణంలో తేమ పెరిగి శరీరంపై ప్రభావం పడే ఛాస్స్ కూడా ఉంది. కాబట్టి ఈ క్రమంలో తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. వానా కాలంలో ఆహారాలు తీసుకునే క్రమంలో తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా చాలా మంది ఈ క్రమంలో పాలతో పాటు పెరుగును వినియోగిస్తున్నారు. అయితే వానా కాలంలో వీటిని తీసుకోవడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
వర్షాకాలంలో పాలు, పెరుగు తీసుకోవచ్చా?:
వర్షాకాలంలో పాలు, పెరుగును అతిగా తీసుకోవద్దని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆరోగ్యంపై ప్రభావం పడే ఛాన్స్ కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు.
క్రిముల ప్రభావం పెరుగుతుంది:
వానా కాలంలో పచ్చని గడ్డి అతిగా పెరుగుతుంది. దీని కారణంగా కలుపు మొక్కలు కూడా పెరుగుతాయి. దీంతో సులభంగా కీటకాలు కూడా సులభంగా పెరుగుతాయి. ఆవు, గేదె, మేకలు మేతగా గడ్డి తినడం వల్ల పాలు ఇచ్చే జంతువుల కడుపులోకి సూక్ష్మక్రిములు కూడా పెరిగే ఛాస్స్ కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి వీటి నుంచి వచ్చిన పాలు తాగడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు కూడా వస్తాయని నిపుణులు చెబుతున్నారు.
Also read: Raksha Bandhan 2023: ఈ సంవత్సరం రాఖీ పండుగ ఎప్పుడు వచ్చిందో తెలుసా?
జీర్ణక్రియ సమస్య:
అతిగా కొలెస్ట్రాల్ ఉన్న పాల ఉత్పత్తులను వినియోగించడం వల్ల జీర్ణక్రియపై ప్రభావం పడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీని కారణంగా కడుపు నొప్పి, గ్యాస్, విరేచనాలు, వాంతులు వంటి సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. అంతేకాకుండా తీవ్ర పొట్ట సమస్యలు వస్తాయి. కాబట్టి తప్పకుండా కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండే పాలను తీసుకోవడం మానుకోవాలి.
జలుబు, ఫ్లూ ప్రమాదం:
వానా కాలంలో పెరుగు అతిగా తీసుకోవడం వల్ల తీవ్ర జీర్ణక్రియ సమస్యలతో పాటు జలుబు, ఫ్లూ వంటి సమస్యలు కూడా వచ్చే అవకాశాలున్నాయి. అంతేకాకుండా అతిగా చల్లని పదార్థాలు కూడా తీసుకోవడం మానుకోవాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also read: Raksha Bandhan 2023: ఈ సంవత్సరం రాఖీ పండుగ ఎప్పుడు వచ్చిందో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook