Moringa Paratha: సులువుగా బరువు తగ్గాలంటే ఈ పరాటా డైలీ ఒకటి తినాలి!
Moringa Paratha Recipe: మునగాకు పరాటా ఆరోగ్యానికి అద్భుతమైన బ్రేక్ ఫాస్. దీని తయారు చేయడం ఎంతో సులభం. ఇందులో ఉండే పోషకాలు శరీరానికి ఎలా సహాయపడుతాయి అనేది మనం తెలుసుకుందాం.
Moringa Paratha Recipe: పరాటా అంటే ఇష్టపడని వారు అంటూ ఉండరు. ఇది బ్రేక్ ఫాస్‌లో తయారు చేసుకొనే డిష్. పరాటాలు వివిధ రకాలుగా తయారు చేస్తుంటారు. ఇందులో మునగాకుతో తయారు చేసే పరాటాకు ఎంతో ప్రత్యేకత ఉంది. దీని ఆహారంలో చేర్చుకోవడం వల్ల శరీరానికి ఎన్నో ఆరోగ్యలాభాలు కలుగుతాయని ఆరోగ్యానిపుణులు చెబుతున్నారు. అయితే దీని ఎలా తయారు చేసుకోవాలి? ఎలాంటి పోషకాలు ఉంటాయి? అనేది మనం ఇక్కడ తెలుసుకుందాం.
మునగాకు ను డ్రమ్ స్టిక్ ట్రీ అని కూడా పిలుస్తారు. ఇందులో బోలెడు పోషకాలు ఉంటాయి. దీని తినడం వల్ల రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. ఇందులో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్‌లు జలుబు, దగ్గు వంటి సాధారణ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అలాగే దీని ప్రతిరోజు ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల రక్తహీనత మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. గుండె సంబంధిత సమస్యలతో బాధపడేవారు కూడా ఈ మునగాకు తో తయారు చేసే ఆహారపదార్థాలు తీసుకోవడం వల్ల శరీరానికి మేలు కలుగుతుంది. అలాగే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. గ్యాస్, మలబద్ధకం, ఉబ్బరం వంటి సమస్యలతో బాధపడేవారు కూడా దీని తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థత మెరుగుపడుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని మృదువుగా, మెరిసేలా చేస్తాయి. ఎముకలు దృఢంగా ఉండాలంటే దీని ఆహారంలో ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
కావలసిన పదార్థాలు:
గోధుమ పిండి - 2 కప్పులు
మునగ ఆకులు - 1 కప్పు (కొత్తగా కోసి, నీరు పిండి వేయాలి)
ఉల్లిపాయ - 1 (చిన్నగా తరిగినది)
ఆవాలు - 1/2 టీస్పూన్
జీలకర్ర - 1/4 టీస్పూన్
కారం పొడి - 1/2 టీస్పూన్
అల్లం - చిన్న ముక్క (తరిగినది)
కొత్తిమీర - కొద్దిగా (తరిగినది)
ఉప్పు - రుచికి తగినంత
నూనె - వేయడానికి తగినంత
తయారీ విధానం:
గోధుమ పిండిని ఒక పాత్రలో తీసుకొని, దానిలో మునగ ఆకుల రసం, ఉప్పు వేసి కలపాలి. క్రమంగా నీళ్లు పోసి మృదువైన పిండి చేయాలి. ఈ పిండిని కొద్ది సేపు కప్పి ఉంచాలి. ఆ తరువాత ఒక పాన్‌లో నూనె వేసి వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసి వేగించాలి. ఇందులోకి ఉల్లిపాయ, అల్లం, కారం పొడి వేసి వేగించాలి. చివరగా మునగ ఆకులు, కొత్తిమీర వేసి కలపాలి. పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి, వాటిని చపాతీలా తయారు చేసుకోవాలి. ప్రతి పరోటాపై పూరీ మిశ్రమం అరచేతితో పాకులా పరచాలి. తర్వాత అంచులను కలిపి గుండ్రంగా చేసి, చపాతీలా వెంట్రుకతో బాగా చదును చేయాలి. తవా వేడి చేసి, పరాటాను వేసి రెండు వైపులా నూనె రాస్తూ బంగారు రంగు వచ్చే వరకు వేయాలి. మునగాకు పరాటాను పచ్చడి లేదా కూరలతో సర్వ్ చేయవచ్చు.
Also Read: Orange Seeds: పొరపాటున కూడా ఈ గింజలు పడేయకండి.. దీని వల్ల లాభాలెన్నో..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.