Mosquito Prevention: దోమలు ఇంట్లోకి రాకుండా ఉండేందుకు ఈ టెక్నిక్ పాటించండి!
Mosquito Prevention: శీతాకాలం ముగిసిన తర్వాత దోమలు బెడద ఎక్కువ అవ్వనుంది. వీటి వల్ల డెంగ్యూ, మలేరియా బారిన పడే అవకాశం ఉంది. ఈ క్రమంలో ముందుగానే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల దోమల బెడదను నివారించవచ్చు.
Mosquito Prevention: వేసవి కాలం వచ్చిందంటే దోమల బెడద మొదలవుతుంది. దోమలు మన రక్తాన్ని పీల్చడం సహా అనేక అనారోగ్య సమస్యలను వెంట తీసుకొస్తాయి. అయితే దోమలను అరికట్టేందుకు అనేక పద్ధతులు మనకు అందుబాటులో ఉన్నాయి. కానీ, వాటిలో అంతగా ప్రభావం చూపేవి లేకపోవడం దురదుష్టకరం. కానీ, ఇంట్లోకి దోమలు రాకుండా కొన్ని మార్గాలున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇంట్లోని కిటికీలకు జల్లెడ..
నెదర్లాండ్స్‌కు చెందిన కొందరు ఎంటమాలజిస్ట్ లు దోమలపై పరిశోధనలు చేశారు. డ్యుయిష్ వెల్లె నివేదిక ప్రకారం.. ఈ శాస్త్రవేత్తలు ప్లాస్టిక్ మెష్‌ను కనుగొన్నారు. దీన్ని ఇంట్లోని కిటికీ బయట ఉంచినట్లయితే.. దోమలు ఇంట్లోకి ప్రవేశించవు. అయితే ఆ మెష్ పై పురుగు మందును పూసి ప్రయోగించినట్లు ఆ నివేదిక పేర్కొంది. ఆ జల్లెడపై దోమలు వాలగానే చనిపోయాయని అందులో ఉంది.
ఈ విధంగా వాడడం వల్ల ఇంట్లో కాయిల్స్ రీఫిల్ పొగను ఎదుర్కొవాల్సిన అవసరం లేదు. ఇదే విధమైన టెక్నిక్ ను నెదర్లాండ్స్ శాస్త్రవేత్తలు టాంజానియాలోని కొన్ని ప్రాంతాల్లో ఈ పద్ధతిని పరీక్షించారు. దాని ఫలితం అధ్భుతంగా ఉండడం వల్ల ఇదే టెక్నిక్ ను ఆఫ్రికాలోనూ అమలు పరిచి.. దోమలను అరికట్టడంలో అద్భుమైన ఫలితాన్ని రాబట్టారు.
స్మార్ట్‌ఫోన్‌ల నుండి దోమలు పారిపోతాయా?
దోమలను తరిమికొట్టడానికి స్మార్ట్‌ఫోన్‌లు కూడా సహాయపడతాయని నిరూపించవచ్చు. స్మార్ట్ ఫోన్ లో కొన్ని యాప్స్ ను డౌన్ లోడ్ చేసుకొని.. దాని నుంచి వచ్చే ఫీక్వెన్సీ శబ్దాలకు దోమలు పారిపోతాయి. ఈ శబ్దాలను దోమలు ఇష్టపడవు. అందుకే అవి వాటి నుంచి దూరంగా వెళ్లిపోతాయి. ఈ పద్ధతిని శాస్త్రీయంగా నిరూపించారు.
Also Read: Bad Food Combinations: కీర దోసకాయతో పాటు ఈ కూరగాయలు అసలు తినొద్దు!
Also Read: Insomnia Causes: నిద్రలేమితో బాధపడుతున్న యువకులు.. సోషల్ మీడియానే కారణం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook