Fruit Juice Side Effects: ఖాళీ కడుపుతో ఇవి తాగుతున్నారా? యమ డెంజర్..
Fruit Juice Side Effects: ఖాళీ కడుపుతో పండ్ల రసాలు తాగడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తరచుగా తాగేవారు తప్పకుండా ఈ దుష్ప్రభావాలు తప్పకుండా తెలుసుకోవాల్సి ఉంటుంది.
Fruit Juice Side Effects: ప్రస్తుతం చాలా మంది ఉదయం పూట ఎక్కువగా అల్పాహారాలకు బదులుగా పండ్ల రసాలను తాగుతున్నారు. కొంతమందైతే నేరుగా పండ్లను తింటున్నారు. నిజానికి ఇలా తినడం వల్ల మంచి ఫలితాలు పొందినప్పటికీ, ఇదే పండ్లతో తయారు చేసిన రసాలు తాగడం వల్ల అనేక రకాల దుష్ప్రభావాలు వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఉదయాన్నే అతిగా ఫ్రూట్ డ్రింక్స్ తీసుకోవడం వల్ల అజీర్ణంతో పాటు పోషకాల లోపం వంటి సమస్యలు వచ్చే ఛాన్స్‌లు కూడా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇవే కాకుండా ఇతర అనేర రకాల దుష్ప్రభావాలు రావచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే అల్పాహారానికి బదులుగా ఫ్రూట్ డ్రింక్ తాగడం వల్ల కలిగే నష్టాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఖాళీ కడుపుతో పండ్ల రసాలు తాగడం వల్ల కలిగే 5 దుష్ప్రభావాలు:
1. అజీర్ణం:
పండ్ల రసాలలో చక్కెర ఎక్కువగా ఉంటుంది. ఇది ఖాళీ కడుపులో తీసుకుంటే అజీర్ణం, గ్యాస్‌తో పాటు ఉబ్బరం వంటి పొట్ట సమస్యలను కలిగించే అవకాశాలు ఉన్నాయి. ఖాళీ కడుపుతో పండ్ల రసం తీసుకుంటే రసం పూర్తిగా, త్వరగా జీర్ణమవ్వడమే కాకుండా ఇతర అనేక అనారోగ్య సమస్యలకు దారి తీసే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి.
2. రక్తంలో చక్కెర స్థాయిల ప్రమాదం:
పండ్ల రసాలలోని చక్కెర శరీరం ఎంతో త్వరగా గ్రహిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీని వల్ల రక్తంలో చక్కెర స్థాయిలో హెచ్చుతగ్గులు ఏర్పడతాయి. కొంతమందిలో అలసట, ఆకలి పెరుగుతాయి. ఖాళీ కడుపుతో రసాలను తీసుకున్నప్పుడు, ఈ ప్రభావం మరింత తీవ్రంగా పెరుగుతుంది. ఎందుకంటే ఆహారం చక్కెరను గ్రహించే రేటును నెమ్మదించే ఛాన్స్ కూడా ఉందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
3. పోషకాల లోపం:
ఈ పండ్ల రసాలను తయారు చేసేటప్పుడు, పండ్లలోని ఉండే పోషకాలు, విటమిన్స్ చాలా వరకు తొలగిపోతాయే ఛాన్స్ ఉందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఇందులో ఉండే ఫైబర్ పూర్తిగా తగ్గిపోయే ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ రసాలు తాగడం వల్ల పోషకాల లోపం వంటి సమస్యలు కూడా రావచ్చు. ముఖ్యంగా ఈ రసాలను ఖాళీ కడుపుతో తీసుకుంటే అనేక అనారోగ్య సమస్యలకు దారీ తీసే ఛాన్స్ ఉంది.
4. దంత సమస్యలు:
పండ్ల రసాలలో చక్కెర పళ్ళపై పేరుకుపోయి దంత క్షయానికి దారితీస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఖాళీ కడుపుతో తీసుకున్నప్పుడు, లాలాజల ఉత్పత్తి తక్కువగా ఉంటుంది. ఇది చక్కెరను పళ్ళ నుంచి తొలగించడంలో విఫలమయ్యే ఛాన్స్ ఉంది. దీంతో అనేక రకాల అనారోగ్య సమస్యలకు దారీ తీసే ఛాన్స్ కూడా ఉంది.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
5. బరువు పెరగడం:
పండ్ల రసాలలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. ఫైబర్ అతి తక్కువ పరిమాణంలో ఉండే ఛాన్స్ ఉంది. కాబట్టి ఖాళీ కడుపుతో తీసుకుంటే బరువు పెరిగే ఛాన్స్ కూడా ఉంది. ఖాళీ కడుపుతో తీసుకున్నప్పుడు, శరీరం ఆహారం నుంచి శక్తిని పొందలేకపోయే ఛాన్స్ కూడా ఉంది. దీని వల్ల కేలరీలు కొవ్వుగా నిల్వ అవుతాయి. కాబట్టి కొలెస్ట్రాల్ పెరిగి బరువు పెరిగే ఛాన్స్‌లు ఉన్నాయి.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి