Most Luxurious Trains in India: మీరు జీవితంలో మరచిపోలేని.. విలాసవంతమైన, రాజభోగాలు అనుభవించే రైలు ప్రయాణం చేయాలనుకుంటున్నారా? అలాంటి విభిన్నమైన ఎక్స్ పీరియన్స్ అందించే రైళ్లు మనదేశంలో చాలానే ఉన్నాయి. అందులో టాప్ -5 లగ్జరీ ట్రైన్స్ గురించి తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1. డెక్కన్ ఒడిస్సీ (DECCAN ODYSSEY)
మహారాష్ట్రలో పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి దీనిని 2005 సంవత్సరంలో ప్రవేశపెట్టారు. ఇది కేంద్రం-మహారాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి సహకారంతో నడుస్తోంది. రాజస్థాన్, మహారాష్ట్ర, గుజరాత్ మరియు కర్ణాటకల గుండా ప్రయాణిస్తుంది. ఇది ప్రయాణీకులకు గొప్ప అనుభూతిని అందిస్తుంది. ఇందులో అత్యాధునిక సౌకర్యాలతో కూడిన అటాచ్డ్ బాత్‌రూమ్‌లు, డీలక్స్ క్యాబిన్‌లు మరియు సూట్ క్యాబిన్‌లు వంటి సౌకర్యాలు ఉన్నాయి. ఇది డైనింగ్ కార్, సెలూన్, బార్ లాంజ్, మినీ జిమ్నాసియం, కాన్ఫరెన్స్ హాల్ మరియు ఆయుర్వేద స్పా వంటి మరికొన్ని అదనపు ఆన్‌బోర్డ్ సేవలను కూడా అందిస్తుంది. వీరు 7 నైట్స్, 8 డేస్ ప్యాకేజీని అందిస్తున్నారు. 


2. మహారాజా ఎక్స్‌ప్రెస్ ( MAHARAJA EXPRESS)
దేశంలోని లగ్జరీ రైళ్లలో మహారాజా ఎక్స్‌ప్రెస్ ఒకటి. ఇది IRCTC ప్రవేశపెట్టిన ఫ్లాగ్‌షిప్ లగ్జరీ రైలు. దీనిలో ప్రయాణించడం ద్వారా రాయల్ అనుభవాన్ని పొందవచ్చు. ఇందులో డీలక్స్ క్యాబిన్‌లు, జూనియర్ సూట్ క్యాబిన్‌లు, ప్రెసిడెన్షియల్ సూట్‌లు ఉన్నాయి. ఈ రైలులో రంగ్ మహల్ మరియు మయూర్ మహల్ అని పిలువబడే రెండు అద్భుతమైన రెస్టారెంట్లు ఉన్నాయి. ఈ రైలు ప్రయాణం మీకు మరచిపోలేని అనుభూతిని మిగులుస్తుంది. 


3. రాయల్ రాజస్థాన్ ఆన్ వీల్స్ (ROYAL RAJASTHAN ON WHEELS)
ఈ ట్రైన్ రాజస్థాన్ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (RTDC) మరియు భారతీయ రైల్వేల జాయింట్ వెంచర్. ఇది రాజస్థాన్‌లోని రాజ గమ్యస్థానాలతో పాటు ఆగ్రా, ఖజురహో మరియు వారణాసి వంటి ప్లేస్ లను కవర్ చేస్తుంది. ఈ రైలు ప్రయాణం కూడా మంచి అనుభూతిని అందిస్తుంది. 


4. ఫ్యాలెస్ ఆన్ వీల్స్ (PALACE ON WHEELS)
దేశంలో ప్రవేశపెట్టబడిన మెుదటి లగ్జరీ రైలు ఇదే. ఇది ప్రపంచ స్థాయి ఆతిథ్యంతోపాటు ఐకానిక్ ప్రయాణాన్ని అందిస్తుంది. ఇది రాజస్థాన్ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ మరియు భారతీయ రైల్వేల జాయింట్ వెంచర్. ఈ రైలులో అన్ని రకాల అత్యాధునిక సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. వరల్డ్ లోనే ఉత్తమమైన లగ్జరీ రైలుగా 'ప్యాలెస్ ఆన్ వీల్స్'కు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ రైలులో మిమ్మల్ని కింగ్, క్వీన్ వలె సకల సదుపాయాలతో మర్యాదలు చేస్తారు. ఇది రాజస్థాన్ లో ప్రముఖ నగరాల్లో ప్రయాణిస్తుంది. 


5. రాయల్ ఓరియంట్ (ROYAL ORIENT)
ఈ రైలు 1994-95లో టూరిజం కార్పొరేషన్ ఆఫ్ గుజరాత్ మరియు భారతీయ రైల్వేల మధ్య జాయింట్ వెంచర్‌గా ప్రవేశపెట్టబడింది. ఇది గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల మధ్య నడుస్తోంది. ఈ ట్రైన్ జర్నీ కుడా మంచి రాయల్ ఫీల్ ను ఇస్తుంది. వీరు 7 నైట్స్, 8 డేస్ ప్యాకేజీని అందిస్తున్నారు. 


Also Read: Vanjangi Hills: ప్రకృతి చేసిన అద్భుతం.. వంజంగి అందం..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook