Foods For Thyroid Health: థైరాయిడ్ గ్లాండ్ మన శరీరంలో ముఖ్యమైన విధులను నిర్వర్తిస్తుంది. ఈ గ్లాండ్ గొంతు భాగంలో సీతాకోక చిలుక ఆకారంలో ఉంటుంది. ఇది హార్మోన్లను ఉత్పత్తి చేయడంలో ఎంతో సహాయపడుతుంది. శరీరంలో శక్తి లెవెల్స్‌ను కూడా అదుపులో ఉంచుతుంది. అయితే ప్రస్తుతకాలంలో చాలా మంది థైరాయిడ్  సమస్యలతో బాధపడుతున్నారు. ఈ సమస్య కారణంగా తీవ్రమైన ఇబ్బందులను పడాల్సి పరిస్థితి నెలకొంది. అయితే ఈ సమస్య బారిన పడకుండా ఉండాలి అంటే మీరు కొన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకోవడం చాలా మంచిది.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల మనం థైరాయిడ్‌ సమస్యల బారినపడాల్సిన అవసరం రాదు.  ముఖ్యంగా థైరాయిడ్ గ్లాండ్‌ పనితీరు చురుగ్గా ఉండాలంటే అయోడిన్ కలిగిన ఆహార పదార్థాలు తీసుకోవాల్సి ఉంటుంది. దీని వల్ల గ్లాండ్‌లో లోపాలు రాకుండా ఉంటాయి. అలాగే థైరాయిడ్ సమస్యలు కూడా తగ్గుతాయి. 


ప్రతిరోజు మీ ఆహారంలో సూప్స్, సలాడ్స్ తీసుకోవడం వల్ల థైరాయిడ్ గ్లాండ్ పనితీరు మెరుగుపడుతుంది. అలాగే కాడ్, సాల్మన్, ట్యూనా వంటి చేపలను తీసుకోవడం వల్ల అయోడిన్ ఎక్కువగా లభిస్తుంది. దీని వల్ల థైరాయిడ్‌ గ్లాండ్ బాగా పని చేస్తుంది.


ప్రతిరోజు పాలు, పాలతో తయారు చేసే ఉత్పత్తులు తీసుకోవడం వల్ల థైరాయిడ్ గ్లాండ్ సరిగ్గా పని చేస్తుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఈ పాల ఉత్పత్తుల్లో ఆయోడిన్‌ ఎక్కువగా లభిస్తుంది. 


అయోడిన్‌ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాల్లో గుడ్లు కూడా ఒకటి. వీటిని తీసుకోవడం వల్ల అయోడిన్ తక్కువగా ఉన్నవారిలో వాటి స్థాయిలను పెంచుతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.  


అంతేకాకుండా అయోడిన్‌ కలిగిన ఉప్పును తీసుకోవడం వల్ల శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది.


బెర్రీలు కూడా థైరాయిడ్ గ్లాండ్ పనితీరులో ఎంతో మేలు చేస్తాయి. వీటిని లభించే అన్ని ఫ్రూట్స్ థైరాయిడ్ గ్లాండ్ పని తీరును మెరుగుపరుచుతుంది.


కూరగాయలు కూడా థైరాయిడ్ గ్లాండ్ పనితీరును మెరుగుపరుచుతుందని. అంతేకాకుండా శరీరానికి కావాల్సిన పోషకాలు కూడా పుష్కలంగా లభిస్తాయి.


Also read: Nails Tips: గోళ్లు పెంచుతున్నారా ? అయితే ఈ షాకింగ్‌ న్యూస్‌ మీకు తెలుసా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook