Nap Benefits: మనిషికి నిద్ర చాలా అవసరం. ఆరోగ్యం కూడా. అదే సమయంలో పగటి నిద్ర మంచిదా కాదా అనే విషయంలో సందేహాలున్నాయి. ఒకవేళ మంచిదైతే పగలు ఎంతసేపు నిద్రపోవాలి, కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రోజుకు 7-8 గంటలు రాత్రి పూట నిద్ర అనేది మనిషికి, అతని ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రతి వైద్యుడూ చెప్పేది ఇదే. మరి పగటి పూట నిద్ర మంచిదా కాదా అనే విషయంపై సందేహాలున్నాయి. ఎందుకంటే చాలామంది పగటి పూట అలా ఓ కునుకు లేదా గంటా రెండు గంటలు నిద్రపోతుంటారు. ఎక్కువమంది చిన్న కునుకు తీస్తుంటారు. ఇది చాలామందిలో ఉండే అలవాటే. అయితే పగలు ఇలా కునుకు తీయడం ఎంతవరకూ మంచిదో తెలుసా మీకు..పగటి పూట చిన్న కునుకు తీయడం వల్ల చాలా సమస్యలు దూరమౌతాయి. సహజంగా పగలు నిద్ర అందరికీ రాదు. కానీ కాస్సేపు చిన్న నిద్ర తీసుకుంటే చాలావరకూ రిలీఫ్ కలుగుతుంది. ముఖ్యంగా స్ట్రెస్ దూరమౌతుంది. కొన్ని టిప్స్ పాటిస్తే మీరు కూడా సులభంగా పగటి పూట చిన్న కునుకు తీయవచ్చు..


1. మీకు కూడా పగలు చిన్న కనుకు తీయాలనుంటే..ముందుగా టైమ్ చూసుకోండి. రోజూ ఏ సమయంలో నిద్రపోతారో అదే సమయంలో నిద్రకు ఉపక్రమించాలి. సమయం అటూ ఇటూ అయితే నిద్రపై ప్రభావం పడుతుంది. అందుకే ప్రతిరోజూ పగటి పూట నిర్ణీత సమయం కేటాయించాలి.


2. మంచి నిద్ర కావాలంటే ..నిద్రించే ప్రదేశం కూడా అనువుగా ఉండాలి. ఎప్పుడూ ఒకే చోటు ఎంచుకుంటే నిద్ర బాగా పడుతుంది. లేకపోతే సరైన నిద్ర పట్టదు.


3. ఒకవేళ మీరు వర్క్ ఫ్రం హోం చేస్తుంటే మంచి నిద్ర కచ్చితంగా ఉండాల్సిందే. అరగంట కోసం అలార్మ్ పెట్టుకుని నిద్రపోతే బాగుంటుంది. పగటి పూట ఇలా ఓ అరగంట నిద్రపోవడం వల్ల రోజంతా ఉన్న అలసట దూరమౌతుంది. 


పగలు కాస్సేపు నిద్రపోవడం వల్ల ఆ వ్యక్తికి అలసట పూర్తిగా దూరమౌతుంది. మానసికంగా ఆరోగ్యాంగా ఉంటాడు. స్ట్రెస్ దూరమౌతుంది. శరీరానికి అవసరమైన ఎనర్జీ లభిస్తుంది. పగటి పూట కొద్దిగా నిద్రించడం వల్ల ఫ్రెష్‌నెస్ ఉంటుంది. అయితే గంటలకొద్దీ నిద్రపోవడం మంచిది కాదు. 


Also read: Husband Wife Secrets: పెళ్లాం ఊరెళితే..భర్తలు చేసే 5 పనులు...కనీసం కలలో కూడా ఊహించలేరు మీరు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook