Neem Oil Benefits: ఆయుర్వేదంలో వేపను అనేక రోగాల విముక్తి కోసం ఉపయోగిస్తారు. వేపలో నయం చేసే గుణాలు పుష్కలంగా ఉంటాయి. వేపను వివిధ స్కిన్ కేర్‌ ఉత్పత్తుల్లో వినియోగిస్తారు. ఇది చర్మం, జుట్టు, పంటి సమస్యలపై కూడా ఎంతో సమర్థవంతంగా పనిచేస్తుంది. వేపలో ఫ్యాటీ యాసిడ్స్‌, విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్‌, లైమోనాయిడ్స్‌ వంటి గుణాలు కలిగి ఉంటాయి. మీ డైలీ హెయిర్‌ కేర్‌ రొటీన్‌లో వేప నూనె ఉండటం వల్ల ఎన్నో ప్రోయోజనాలు అవి ఏంటో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చుండ్రుకు చెక్‌..
వేప నూనె తరచూ జుట్టుకు పట్టించడం వల్ల జుట్టుకు మాయిశ్చర్‌ అందుతుంది. డ్రై స్కాల్ప్‌ సమస్య తగ్గిపోతుంది. కొంతమంది జుట్టు ఫంగల్‌ ఇన్ఫెక్షన్లతో బాధపడుతుంటారు. మలస్సెజియా గ్లబోసా అనే ఫంగల్ వల్ల కలుగుతుంది. వేపలో యాంటీ ఫంగల్‌, యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు ఉంటారు. స్కిన్ సమస్య అయిన డ్యాండ్రఫ్‌కు వేప నూనె చెక్‌ పెడుతుంది.


ఇన్ఫెక్షన్స్‌..
మనం చెప్పుకున్నట్లుగానే వేపలో నయం చేసే గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఈ వర్షాకాలంలో వచ్చే చర్మ సమస్యలకు వేప మంచి రెమిడీ. ఇది యాంటీ ఇన్ల్ఫమేటరీ, యాంటీ సెప్టిక్‌ యాంటీ మైక్రోబ్రియల్‌, యాంటీ వైరల్ గుణాలు కలిగ ఉంటుంది. ముఖ్యంగా ఇది పీహెచ్‌ లెవల్‌ సమతూలన చేస్తుంది. సెబం ఉత్పత్తిని కూడా వేప నియంత్రిస్తుంది. అందుకే కనీసం వారానికి ఒకసారి అయినా వేపను జుట్టుకు అప్లై చేసుకోవాలి.


తెల్లవెంట్రుకలకు చెక్‌..
ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న దాదాపు చాలామంది ఎదుర్కొంటున్న సమస్య. వయస్సుతో సంబంధం లేకుండా తెల్లవెంట్రుకల సమస్య ప్రతి ఒక్కరినీ వేధిస్తుంది. వేపనూనె ఆక్సిడేటివ్‌ స్ట్రెస్‌కు వ్యతిరేకంగా పనిచేస్తుంది. దీంతో వెంట్రుకలు తెల్లబడు ప్రక్రియను ఆలస్యం చేస్తుంది.


ఇదీ చదవండి: నోరూరించే  రొయ్యల కూర ఇలా వండుకుంటే నోట్లో కరిగిపోతుంది అంతే..


నేచురల్‌ కండీషనర్‌..
వేప నూనె నేచురల్‌ కండీషనర్‌గా కూడా పనిచేస్తుందని చాలా మందికి తెలియదు. ఇవి డ్యామేజ్‌ అయిన హెయిర్‌ ఫొలికల్స్‌ కాపాడాయి. వేపనూనె అప్లై చేయడం వల్ల ఇది జుట్టుకు నేచురల్‌ కండీషనర్‌ మాదిరి పనిచేస్తుంది.


వేపనూనె అప్లై చేసే విధానం..
మీ జుట్టుకు కావాల్సినంత నూనె తీసుకుని పట్టించాలి. మృదువుగా జుట్టు అంతా పట్టించాలి. ఓ అరగంట తర్వాత తలస్నానం చేయాలి. లేదా రాత్రి జుట్టుకు వేపనూనె పెట్టుకుని ఉదయం తలస్నానం చేసుకోవచ్చు.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు) 


ఇదీ చదవండి: ముఖం పై ట్యాన్ పోవట్లేదా? ఈ ఈజీ హోమ్ రెమిడీ తో చెక్ పెట్టండి..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter