Bizarre traditional ritual: 'శోభనం' అనేది మనిషి జీవితంలో ఓ మధురమైన ఘట్టం. హిందూ వివాహాల్లో అనుసరించే ముఖ్యమైన ఆచారం ఇది. కొత్తగా వివాహం చేసుకున్న జంట ఈ ఆచారాన్ని పాటిస్తుంది. మెుదటి మూడు రాత్రులు(three nights after marriage) అనుభవం వారికి జీవితాంతం గుర్తుంటుంది. చాలామంది యంగ్​స్టర్స్​కి అదొక తియ్యని అనుభూతి. అయితే ఆ ఐలాండ్ (Island)లోని ఓ తెగ వాళ్లకు మాత్రం అదొక నరకం. ఏంటీ మూడు రాత్రుళ్లు నరకం ఎందుకు అంటారా? అవును మరి ఆ మూడు రాత్రులు బతికితే చాలు రా బాబు.. అనుకునేంత భయపడుతుంటారు ఆ తెగ వాళ్లు.. అక్కడి ఆచారం అలా ఉంది. ఇంతకీ ఆ మూడు రాత్రుళ్లు వాళ్లు ఏం చేస్తారో తెలిస్తే షాక్​ అవ్వాల్సిందే.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వివరాల్లోకి వెళితే..
బోర్నియో ఐలాండ్ (Borneo island) ఆసియాలోనే మూడో అతిపెద్ద దీవి. సుమత్రా దీవులకు తూర్పు భాగంలో ఉన్న ఈ ఐలాండ్‌ను ఇప్పటివరకు ప్రత్యేక దేశంగా గుర్తించలేదు. అయితే, ఇండోనేషియా, బ్రూనై, మలేషియాలకు చెందిన మూడు రాజకీయ పార్టీలు ఈ ప్రాంతాన్నీ పాలిస్తున్నాయి. ఇక్కడి తీర ప్రాంతాలు పర్యాటకులకు ఎంతగానో ఆకట్టుకుంటాయి. అయితే, ఇక్కడ పాటించే కొన్ని ఆచారాలు (Traditions) చాలా చిత్రంగా ఉంటాయి.


Also Read: Ruby Roman grapes: ఈ గ్రేప్స్​ మస్త్‌‌ కాస్ట్‌‌లీ గురూ...! ఒక్క ద్రాక్ష పండు రూ.35 వేలు..! ఎందుకంటే..


ఆ మూడు రోజులు నరకమే..
బోర్నీయాలో నివసిస్తున్న కొన్ని గిరిజన తెగలు.. పెళ్లి (marriage)ని గొప్ప ఆచారంగా భావిస్తాయి. పెళ్లి తర్వాత వధూవరులను (The bride and groom) ఒక గది (room)లో బంధిస్తారు. వారిని కనీసం టాయిలెట్‌కు కూడా వెళ్లనివ్వరు. అలాగని, ఆ గదిలో ఏర్పాట్లు చేస్తారని అనుకున్నా పొరపాటే. ఎందుకంటే.. ఆ మూడు రోజులు వాళ్లు మూత్రాన్ని(Stopping to go to the urinal) ఆపుకోవాలి. కనీసం మల విసర్జన (Defecation )కు కూడా అనుమతి ఇవ్వరు.


ఆ కొత్త జంట ఆ మూడు రోజులు (three days) శోభనాన్ని ఎంజాయ్ చేయడం దేవుడెరుగు. మొదటి రోజు వారికి ఈ ఆచారం ( Prohibits couples from using the bathroom) పెద్దగా ఇబ్బంది కలిగించకపోవచ్చు. కానీ, మిగతా రెండు రోజులు వారికి నరకమే కనిపిస్తుండొచ్చు. శృంగారం అంటే చాలు వణికి పోతారేమో. ఒక వేళ సెక్స్ చేసినా.. ఆ తర్వాత శుభ్రం చేసుకోడానికి కూడా అనుమతి (No permission) కూడా లభించదట. దీంతో వాళ్లు ఆ మూడు రోజులు ఆ గదిలో కలిసి ఉన్న కలవలేని పరిస్థితి నెలకొంటుంది.


మూత్రానికి వెళితే చనిపోతారని..
ఇది ఎన్నాళ్ల నుంచో వస్తున్న సంప్రదాయమని బోర్నియో ప్రజలు చెబుతున్నారు. పెళ్లి తర్వాత వధు, వరులు మూత్రానికి పోయినట్లయితే.. ఇద్దరిలో ఒకరు చనిపోతారని (dies) నమ్ముతారు. అలాగే, వారికి పుట్టే బిడ్డలు పుట్టిన వెంటనే చనిపోతారని భావిస్తారు. ఆ మూడు రోజులు మూత్రానికి వెళ్లకుండా ఆపుకోవడం (Stopping to go to the urinal) వల్ల వారి మధ్య బంధం బలోపేతం అవుతుందని చెబుతున్నారు. అయితే, ఇలా చేయడం ఆరోగ్యానికి మంచిది కాదని వైద్య నిపుణులు తెలుపుతున్నారు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి