Glowing Skin Tips: మనం అందంగా కనిపించడానికి వివిధ రకాల ప్రయత్నాలు చేస్తాం. కొందరైతే బ్యూటీ పార్లర్లకు వెళ్లి వేల రూపాయలు ఖర్చు పెడతారు. ఎప్పటికప్పుడు ముఖసౌందర్యానికి జాగ్రత్తలు తీసుకుంటూనే ఉంటారు. అయితే, ఇంట్లో ఉండే కొన్ని వస్తువులతో సులభంగా ముఖ కాంతిని పెంచవచ్చు. అది ఎలానో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గ్లోయింగ్ స్కిన్ పొందడానికి కలబంద, పసుపు ఆరోగ్యాన్ని కాపాడుతుంది.చర్మ సంరక్షణకు ఉపయోగపడే పోషకాలన్ని ఇందులో ఉంటాయి. కలబంద అద్భుత ప్రయోజనాలు తెలుసుకుందాం.
కలబంద జుట్టు, చర్మం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. దీని జ్యూస్ తాగుతారు. ముఖానికి క్రీమ్‌లాగా కూడా అప్లై చేసుకోవచ్చు. దీంతో చేసిన ప్యాక్‌తో శాశ్వత యవ్వనం పొందుతారు.


ఇదీ చదవండి: Bra Hooks: బ్రాలో 3 హుక్స్ ఎందుకు ఉంటాయో తెలుసా? ఇది చాలా మందికి తెలియదు..!
కలబందలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దీన్ని ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఉపయోగిస్తారు. దీంతో మీ చర్మం మృదువుగా మారుతుంది. ఇందులో ఉండే విటమిన్లు, మినరల్స్, అమినో యాసిడ్స్ ,యాంటీ ఆక్సిడెంట్లు గాయాలు త్వరగా మానుతాయి. ఇది డయాబెటిక్ రోగులకు తగిన ఉపశమనాన్ని అందిస్తుంది. ఇందులోని పోషకాలు రక్తపోటును తగ్గించి గుండె సంబంధిత సమస్యలను తగ్గిస్తాయి. 


చర్మానికి నేరుగా అప్లై చేయకుండా గ్రీన్ టీని మిక్స్ చేసి ఫేస్ మాస్క్‌ని తయారు చేయడం వల్ల మరిన్ని ప్రయోజనాలు లభిస్తాయి. ఇలా చేయడం వల్ల రక్త సరఫరా మెరుగుపడి చర్మం పునరుజ్జీవనం పొందుతుంది. అలోవెరా గ్రీన్ టీ ఫేస్ మాస్క్ తయారు చేయడం చాలా సులభం. ముందుగా ఒక చెంచా అలోవెరాలో అర చెంచా గ్రీన్ టీ కలపాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి మాస్క్‌లా ఉంచుకోవాలి. దీన్ని రాత్రంతా రాయండి. ఉదయం సాధారణ నీటితో కడగాలి.


ఇదీ చదవండి: Camphor Skincare: కర్పూరం ఇలా 10 నిమిషాల్లో మీ ముఖ మెరుపును పెంచుతుంది..


కలబంద ఒక టేబుల్ స్పూన్, 2-3 చుక్కల గ్రీన్ టీ ఆయిల్ మిక్స్ చేసి వల్ల మీ చర్మం మెరుస్తుంది. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించాలి. దీన్ని రాత్రి పడుకునే ముందు అప్లై చేసి, ఉదయాన్నే నీటితో కడిగేయాలి. ఇలా చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. (Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Mediaకి దీనిని ధృవీకరించడం లేదు. )


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter