Nourish Your Skin Naturally: ఈ కూరగాయలు తింటే చాలు మీ ముఖంపై సహజంగానే మెరుపువస్తుంది..
Nourish Your Skin Naturally: మన స్కిన్ ఆరోగ్యవంతంగా మెరుస్తూ కనిపించాలని రకరకాల ప్రయత్నాలు చేస్తాం. ఎన్నో బ్యూటీ ఉత్పత్తులను కొనుగోలు చేస్తాం. అయితే, మనం తినే ఆహారంతో కూడా అందం రెట్టింపు అవుతుంది.
Nourish Your Skin Naturally: మన స్కిన్ ఆరోగ్యవంతంగా మెరుస్తూ కనిపించాలని రకరకాల ప్రయత్నాలు చేస్తాం. ఎన్నో బ్యూటీ ఉత్పత్తులను కొనుగోలు చేస్తాం. అయితే, మనం తినే ఆహారంతో కూడా అందం రెట్టింపు అవుతుంది. సహజంగానే రంగు తేలుతారు. ఈ కూరగాయలు మీ ముఖాన్ని మెరిపిస్తాయి. ఇది సమతుల ఆహారం రోజంతటికీ హైడ్రేషన్ అందిస్తాయి.
క్యారట్లు..
క్యారట్‌లో బీటా కెరోటిన్, పవర్ ఫుల్ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ విటమిన్ ఏ స్కిన్ ఆరోగ్యానికి ప్రేరేపిస్తుంది. స్కిన్ టిష్యూకి మంచిది. ఇది ముఖం పొడిబారడాన్ని తగ్గిస్తుంది. స్కిన్ టోన్‌ను మెరుగుపరుస్తుంది. క్యారట్లో విటమిన్ సీ ఉంటుంది. కొల్లాజెన్ ఉత్పత్తిని బూస్ట్ ఇస్తుంది.
పాలకూర..
పాలకూరలో విటమిన్ ఏ, సీ, ఇ, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది వాతావరణ మార్పుల వల్ల జరిగే స్కిన్ డ్యామేజ్‌నుంచి కాపాడుతుంది. ఇది స్కిన్ ఇన్ల్ఫమేషన్‌ను తగ్గిస్తుంది. పాలకూరలో విటమిన్ కే ఉంటుంది. ఇది ముఖంపై డార్క్ సర్కిల్స్‌ను తగ్గిస్తుంది.
స్వీట్ పొటాటో..
చిలగరడదుంపలో బీటా కెరోటిన్ ఉంటుంది. ఇది చర్మ ఆరోగ్యానికి మంచిది. సన్ డ్యామేజ్ అవ్వకుండా కాపాడుతుంది. చిలగడదుంపలో విటమిన్ సీ, ఇ కూడా ఉంటుంది. ఇవి ఫ్రీ రాడికల్ నుంచి వ్యతిరేకంగా పోరాడుతుంది. ఇది చర్మాన్ని మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా కొల్లాజెన్ ఉత్పత్తికి తోడ్పడుతుంది.
బెల్ పెప్పర్స్..
బెల్ పెప్పర్స్ చాలా మంచి రంగుల్లో ఉంటాయి. విటమిన్ సీ మన చర్మానికి అవసరమైన కొల్లాజెన్ ఉత్పత్తికి తోడ్పడుతుంది. కొల్లాజెన్ స్కిన్ ఎలాస్టిసిటీని బలపరుస్తుంది. బెల్ పెప్పర్స్ మీ డైట్లో చేర్చుకుంటే మీ ముఖ రంగు మెరుగుపడుతుంది. ఇది ముఖంపై ఉన్న మచ్చలను గీతలను తొలగిస్తుంది. వృద్ధాప్యఛాయలు రాకుండా నివారిస్తుంది.
టమాటాలు..
టమాటాల్లో లైకోపీన్ ఉంటుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు యూవీ డ్యామేజ్ నుంచి రక్షిస్తుంది. మీ ముఖంపై వృద్ధాప్య ఛాయలు రాకుండా నివారిస్తుంది. టమాటాల్లో విటమిన్ సీ ఉంటుంది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తికి తోడ్పడుతుంది. ముఖానికి మెరుపును అందిస్తుంది. మీ ముఖం నేచురల్‌గా మెరిసిపోతుంది.
ఇదీ చదవండి: మీ బ్రేక్ ఫాస్ట్ లో ఈ 6 ఫైబర్ పుష్కలంగా ఉండే ఆహారాలు ఉంటే బరువు పెరిగే ఛాన్సే లేదు
కీరదోసకాయ..
కీరదోసకాయలో నీటి శాతం అధికంగా ఉంటుంది. ఇది చర్మానికి రోజంతటికీ కావాల్సిన హైడ్రేషన్ అందిస్తుంది. మీ ముఖం పొడిబారకుండా కాపాడుతుంది. కీరదోసకాయలో సిలికా కూడా ఉంటుంది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తికి తోడ్పడుతుంది.
ఇదీ చదవండి: ఒక చుక్క కొబ్బరినూనె మీ ముఖానికి రాస్తే హిరోయిన్ వంటి అందమైన చర్మం మీదే..
బ్రోకోలీ..
బ్రోకోలీ క్రూసిఫెరస్ కూరగాయ. ఇందులో విటమిన్ ఏ, సీ, కే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు ఇందులో ఉండే ఖనిజాలు ఫ్రీ రాడికల్ డ్యామేజ్ రాకుండా, ఇన్ల్ఫమేషన్ రాకుండా నివారిస్తుంది. చర్మ కణాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. బ్రోకోలీ సల్ఫోరఫేన్ ఉంటుంది. బ్రోకోలీలో మీ ముఖాన్ని కాంతివంతంగా చేయడంలో కీలకపాత్ర పోషిస్తుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter