మూత్రశాలలకు సరికొత్త `యాప్`
మనకు ఏదైనా ఒక కొత్త ప్రదేశానికి వెళ్తే అక్కడ మూత్రశాల ఉందో, లేదో తెలుసుకోవడం కష్టమవుతుందన్న విషయం నిజమే కదా. ఒక్కరే తెలియని ప్రదేశానికి వెళ్తే ఈ విషయం ఎవరిని అడగాలి? అని కూడా సందేహపడుతూ ఉంటారు. అలాంటి వారికోసం ఈ కొత్త మొబైల్ యాప్ వాడుకలో వచ్చింది.
' గూగుల్ మ్యాప్ టాయిలెట్ లొకేటర్' అనేది ఆ యాప్ పేరు. దీనిని గూగుల్ అభివృద్ధి చేసింది.అందులో మీకు దగ్గరలో ఉన్న మూత్రశాలల వివరాలు కనిపిస్తాయి. ఒకవేళ మీకు దగ్గర్లో ఏ మూత్రశాల లేకుంటే మాల్స్, రెస్టారెంట్, హాస్పిటల్స్, పెట్రోల్ బంక్స్.. ఇలా ఎక్కడ మూత్రశాల ఉంటే దాని వివరాలు కనిపిస్తాయి. ఈ యాప్‌ను ఆండ్రాయిడ్ ఫోన్లలో గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. భలేగా ఉంది కదూ..! ఈ యాప్. ఎంచక్కా మొబైల్‌లోనే అన్ని వివరాలు తెలుసుకోవచ్చు. ఇలాంటిదే మరో యాప్ ఉంది. దాని పేరు ' టాయిలెట్ ఫైండర్'.