Cauliflower Pickle Recipe: క్యాలీప్లవర్‌ ఆవకాయ తినడానికి ఎంతో రుచికరంగా ఉంటుంది. దీనిని రైస్‌, అల్పాహారాలతో కలిపి తీసుకోవచ్చు. అయితే ఈ క్యాలీప్లవర్‌ ఆవకాయ ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఎంతో రుచిగా, సుల‌భంగా చేసుకోగ‌లిగే ఈ క్యాలీప్ల‌వ‌ర్ ఆవ‌కాయ‌ను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

క్యాలీప్ల‌వ‌ర్ ఆవ‌కాయ పదార్థాలు:


పెద్ద‌  క్యాలీప్ల‌వ‌ర్ ,  టీ స్పూన్ జీల‌కర్ర, టీ స్పూన్ మెంతులు, టీ స్పూన్ ఆవాలు, ఒక క‌ప్పు నూనె, తాళింపు దినుసులు,  వెల్లుల్లి మొక్కలు తగినంత, నాలుగు ఎండుమిర్చి, కరివేపాకు, ఉప్పు పావు, కారం పావు, అర టీ స్పూన్‌ పసుపు, నిమ్మకాయ నాలుగు


క్యాలీప్ల‌వ‌ర్ ఆవ‌కాయ తయారు చేసుకోండి ఇలా:  


క్యాలీప్ల‌వ‌ర్ ను కాడ‌లు లేకుండా ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి. ఒక గిన్నెలో నీళ్లు పోసి అందులో ఉప్పు వేసి నీటిని బాగా మ‌రిగించాలి. త‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి క్యాలీప్ల‌వ‌ర్ ముక్క‌ల‌ను వేసి ఒక నిమిషం పాటు ఉంచాలి. త‌రువాత క‌ళాయిలో జీల‌క‌ర్ర  ఆవాలు, మెంతులు వేసి వేయించాలి. వీటిని ప్లేట్ లోకి తీసుకోవాలి. త‌రువాత వీటిని జార్ లో వేసి మెత్త‌ని పొడిగా చేసుకోవాలి. పాన్‌లో నూనె  వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక క్యాలీప్ల‌వ‌ర్ ముక్క‌ల‌ను వేసి వేయించాలి. వీటిని ఐదు నిమిషాల పాటు వేయించిన త‌రువాత గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత అ తాళింపు దినుసులు వేసి వేయించాలి.


Also read: Black Pepper: నల్ల మిరియాల వల్ల ఎన్నో ఉపయోగాలు..తప్పక తెలుసుకోండి!


వెల్లుల్లి రెమ్మ‌లు, ఎండుమిర్చి, క‌రివేపాకు వేసి వేయించాలి. తాళింపు చ‌ల్లారిన త‌రువాత ఇందులో వేయించిన క్యాలీప్ల‌వ‌ర్ ముక్క‌లు వేసి క‌ల‌పాలి. ఇందులోకి ఉప్పు, కారం, మిక్సీ ప‌ట్టుకున్న జీల‌క‌ర్ర పొడి, ప‌సుపు వేసి క‌ల‌పాలి.  త‌రువాత నిమ్మ‌కాయ‌ల  ర‌సాన్ని తీసుకోవాలి. త‌గినంత నిమ్మ‌ర‌సం వేసి క‌ల‌పాలి. ఈ ప‌చ్చ‌డిని గాజు సీసాలో వేసి ఊర‌బెట్టాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే క్యాలీప్ల‌వ‌ర్ ఆవ‌కాయ త‌యార‌వుతుంది. 


Also read: Sankranthi Muggulu 2024: సంక్రాంతి పండగ రోజు తప్పకుండా ఇంటి ముందు వేసుకోవాల్సిన 7 ముగ్గులు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter