Oats Facepack: ముఖం జిడ్డుగా మారుతోందా.. అయితే ఓట్స్ ఫేస్ ప్యాక్ మీకోసమే
Skincare beauty tips: ఈ ఎండాకాలంలో శరీరంతో పాటు ముఖాన్ని కాపాడుకోవడం కూడా పెద్ద పని అయిపోయింది. ఎండల కారణంగా చర్మం చాలా త్వరగా జిడ్డుగా మారిపోతుంది. ఈ సమయంలోనే ఓట్స్ తో చేసే ఫేస్ ప్యాక్ మనకి ఎంతో అవసరం. మరి దాని తయారీవిధానం ఒకసారి చూద్దాం..
Summer Facepack : అసలే ఇది వేసవికాలం. బయటకు వెళ్లకుండా ఇంట్లోనే కూర్చున్నా కూడా చెమటలు మాత్రం తప్పడం లేదు. దానివల్ల ముఖం జిడ్డుగా మారిపోతుంది. దుమ్ము, ధూళి కూడా చేరిపోయి ముఖాన్ని డల్ గా మార్చేస్తూ ఉంటాయి. అయితే ముఖం తిరిగి అందంగా మారడం కోసం పార్లర్ దాకా పరిగెట్టాల్సిన అవసరంలేదు. మన ఇంట్లో ఉంటూ కూడా చర్మాన్ని అందంగా మార్చుకోవచ్చు. ఇంట్లో దొరికే పదార్థాలతోనే మంచి ఫేస్ ప్యాక్ చేసుకొని.. దానితో మన ముఖాన్ని మళ్ళీ కాంతివంతంగా మార్చుకోవచ్చు. ముఖ్యంగా ఓట్స్ ఫేస్-ప్యాక్ అందరికీ చాలా బాగా సెట్ అవుతుంది. కేవలం ఇంట్లో దొరికే పదార్థంతోనే ఈ ఫేస్ ప్యాక్ ని చేసుకోవచ్చు.ఇది మన చర్మాన్ని మృదువుగా కూడా మార్చి, జిడ్డుతనం పోగొట్టి, ముఖాన్ని కాంతివంతంగా మార్చుతుంది. మరి దీని తయారీ విధానం ఒకసారి చూద్దాం.
చాలా త్వరగా మంచి ఫలితాన్ని చూపించే ఈ ఫేస్ ప్యాక్ కి కావలసినవి.. కేవలం మూడే మూడు పదార్థాలు.
ఓట్స్:
ఓట్స్ తినడం వల్ల మాత్రమే కాక.. చర్మానికి ఉపయోగించడం వల్ల కూడా చాలా ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యంగా ఓట్స్ వల్ల రంగు చాలా మెరుగవుతుంది. అలాగే ఓట్స్ ని మంచి ఎస్ఫోలియేటర్ గా కూడా వాడవచ్చు. దానివల్ల చర్మ రంధ్రాలు తెరుచుకొని, అందులో ఇరుక్కుపోయిన దుమ్ము ధూళి వంటివి బయటకువచ్చేసి, చర్మం చాలా అందంగా కనిపిస్తుంది.
పాలు:
పాలల్లో ఉండే కాల్షియం మన శరీరానికి ఎంత చేస్తుందో, పాలల్లో ఉండే విటమిన్స్, ప్రోటీన్స్ మన చర్మ సౌందర్యానికి కూడా అంతే బాగా ఉపయోగపడతాయి. పాలు మొహాన్ని కాంతివంతం చేసే కొల్లాజెన్ ను ఉత్పత్తి చేస్తారు. అది మన చర్మం యవ్వనంగా కనిపించేలా కూడా చేస్తుంది.
తేనె:
తేనె మన చర్మానికి ఎంతో మంచిది. అందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మన చర్మాన్ని కాపాడతాయి. తేనె మన చర్మానికి సహజంగా మాయిశ్చరైజ్ చేస్తుంది. అంతే కాకుండా ముఖం ఇంతకు ముందు కంటే మెరిసేలాచేస్తుంది.
ఫేస్ ప్యాక్ ఎలా చేయాలి..
ముందుగా రెండు టీ స్పూన్ల ఓట్స్ ను తీసుకుని వాటిని మెత్తగా పొడి చేసుకోవాలి. ఆ పొడి లో 1 టీ స్పూన్ తేనె, 2 టీ స్పూన్ల పాలు వేసి బాగా కలపాలి. అంతే ఫేస్ ప్యాక్ రెడీ. దానిని ముఖం, మెడకి అప్లై చేసుకుని ఒక 20 నిమిషాలు ఆరేదాక వదిలేయండి. తర్వాత నీళ్ళతో శుభ్రం చేసుకోండి. వెంటనే మీకు మంచి రిజల్ట్ కూడా కనిపిస్తుంది.
Also Read: White House: అమెరికా అధ్యక్ష నివాసం వద్ద కలకలం.. గేటును ఢీకొట్టిన కారు వ్యక్తి మృతి
Also Read: Cable Bridge: కేబుల్ బ్రిడ్జ్‌పై బర్త్ డే వేడుకలు.. పోలీసులైతే రూల్స్ వర్తించవా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter