Oily Skin Beauty Tips: మనలో చాలా మంది చర్మ సంరక్షణ కోసం ఎక్కువగా డబ్బులను ఖర్చు చేస్తుంటారు. మరి కొందరు వివిధ రకాల ఫేస్‌ క్రీములను, ప్రొడెక్ట్స్‌ను ఉపయెగిస్తారు. కానీ ఈ ప్రొడెక్ట్స్‌లను ఉపయోంచడం వల్ల చర్మంపై జిడ్డు, మొటిమలు, మచ్చలు కలుగుతాయి. మనలో  కొందమంది జిడ్డు సమస్యలతో బాధపడుతుంటారు. చర్మంపై జిడ్డు సమస్య కలగడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. సేబేషియస్‌ అనే గ్రంథుల నుంచి వచ్చే సెబం అనే నూనె ఉత్పత్తి జిడ్డు ను కలిగిస్తుంది. కొన్ని సార్లు హార్మోన్‌ల మార్పుల కారణంగా కూడా జిడ్డు సమస్యలు కలుగుతాయి. అలాగే అధికంగా కొవ్వు, మసాలా పదార్థాలు తీసుకోవడం వల్ల జిడ్డు కలుగుతుంది. అయితే ఈ సమస్య నుంచి ఉపశమనం పొందడానికి మార్కెట్‌లో లభించే క్రీములు కాకుండా ఇంట్లోనే లభించే కొన్ని పదార్థాలను ఉపయోగించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గ్రీన్‌ టీ కేవలం బరువు తగ్గించడంలో మాత్రమే కాకుండా అందాన్నికి కూడా ఎంతో మేలు చేస్తుంది.  2015 అధ్యయనం ప్రకారం గ్రీన్ టీ ని ఉపయోగించడం వల్ల ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు సెబమ్ ఉత్పత్తిని తగ్గిస్తాయి. దీని వల్ల చర్మపైన కలిగే జిడ్డు తొలుగుతుంది. ప్రతిరోజు గ్రీన్‌ టీ ను ఉయోగించడం వల్ల చర్మంపై మొటిమలు, మచ్చులు తగ్గుతాయి. అలాగే సెబమ్‌ కూడా మాయం అవుతుంది. జిడ్డు చర్మాన్నికి పాలు కూడా ముఖాన్నికి ఎంతో మేలు చేస్తుంది. జిడ్డు చర్మం ఉన్నవారు ప్రతిరోజు పాలల్లో ముఖాన్ని అరగంట పాటు ఉంచి బయటకు తీయాలి. ముఖాన్ని చల్లటి నీటితో కడుకోవాలి.  దీని వల్ల చర్మం జిడ్డు బారిన పడకుండా ఉంటుంది.  తేనే ఒక సహజమైన స్వీటెనర్‌ దీని ఉపయోగించడం వల్ల జిడ్డు చర్మం సులభంగా తొలుగుతుంది. ఇందులో ఉండే  యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు జిడ్డును కలిగే గ్రంథాలను తొలగిస్తుంది. తేనె, నెయ్యి కలిపి ఫేస్‌ పైన 15 నిమిషాల్లో పాటు ఉంచడం వల్ల ఫేస్‌ శుభ్రంగా ఉంటుంది. 



నిమ్మరసం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా ఫేషియల్ కి కూడా ఎంతో సహాయపడుతుంది. నిమ్మరసాని ఏదైనా ఫేషియల్ క్లీన్జర్ , నీటితో కలుపుకొని  ఐస్ క్యూబ్ లు తయారు చేసుకోవాలి. ఈ ఐస్‌ క్యూబ్స్‌ని జిడ్డు ఉన్న చర్మంపై ప్రతిరోజు రుద్దడం వల్ల చర్మం శుభ్రంగా మారుతుంది. అంతేకాకుండా జిడ్డు చర్మం తొలగించడంలో గుడ్డు తెల్లసొన, నిమ్మరసం, ద్రాక్షపండు రసం ఎంతో మేలు చేస్తాయి. అయితే ఈ మూడింటిని సమానంగా, తక్కువగా కలుపుకోవాలి. అప్పుడు చిట్కా పనిచేస్తుంది. వీటిని కలుపుకొని ఫేస్‌ పైన అరగంట పాటు ఉంచడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. ఇందులో ఉపయోగించే పదార్ధాలు చర్మాన్ని సహజమైన క్లెన్సర్‌లాగా, ముడతలు పడకుండా, చర్మాన్ని మృదువుగా చేయడంలో ఎంతో ఉపయోగపడుతుంది. 



వీటితో పాటు కొబ్బరి పాలు కూడా చర్మాన్నికి ఎంతో సహాయపడుతుంది. కొబ్బరి పాలు దొరకని సమయంలో కొబ్బరి నూనెను కూడా ఉపయోగించవచ్చు. దీని  అరగంట పాటు చర్మంపై మృదువుగా మాసాజ్‌ చేయడం వల్ల జిడ్డును ఉత్పత్తిని చేసే గ్రంథాలు మూసుకుపోతాయి. కాబట్టి కొబ్బరి నూనె మేకప్ రిమూవర్ గా కూడా ఉపయోగించుకోవచ్చు. వీటితో పాటు ఆయిల్‌ స్కిన్‌ ఉన్నవారు ప్రతిరోజు శుభ్రంగా ముఖాన్ని కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం తాజాగా ఉంటుంది. 
 


Also Read: Honey Combinations: తేనెను వీటితో కలిపి తింటున్నారా? తస్మాత్‌ జాగ్రత్త!!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.