COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Palak Roti Recipe: పాలకూరలో శరీరానికి కావాల్సిన పోషకాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల పోషకాల లోపం నుంచి ఉపశమనం కలుగుతుంది. ముఖ్యంగా ఇందులో ఉందులో ఉండే విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కె, విటమిన్ బి6, ఫోలేట్ అనేక రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. ఇందులో లభించే ఐరన్, మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం, మాంగనీస్ శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచేందుకు కీలక పాత్ర పోషిస్తాయి. అంతేకాకుండా కంటి చూపును మెరుగుపరచడానికి కూడా కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే ఇందులో ల్యూటిన్, జియాక్సంతిన్, బీటా-కెరోటిన్ యాంటీఆక్సిడెంట్లు లభిస్తాయి. కాబట్టి క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల గుండె సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది. దీంతో పాటు ఇందులో ఉండే గుణాలు ఇతర అనారోగ్య సమస్యల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది.


పాలకూరను వివిధ రకాల ఆహార పదార్థాల్లో వినియోగించవచ్చు. చాలా మంది ఈ కూరను ఎక్కువగా పరాటల్లో వినియోగిస్తూ ఉంటారు. అయితే ఈ పాలకూర ఆకులను రోటీల్లో కూడా వినియోగించవచ్చు. పాల కూరతో తయారు చేసిన రోటీలను ప్రతి రోజు తీసుకోవడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. అయితే ఈ రోటీలను ఎలా తయారు చేసుకోవాలో, కావాల్సిన పదార్థాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.


కావలసిన పదార్థాలు:
2 కప్పుల గోధుమ పిండి
3 కప్పుల పాలకూర (తరిగిన)
1/2 కప్పు ఉల్లిపాయ(తరిగిన)
1/2 అంగుళం అల్లం(తరిగిన)
2 పచ్చిమిరపకాయలు(తరిగిన)
1/2 టీస్పూన్ జీలకర్ర
1/2 టీస్పూన్ శనగపిండి
1/4 టీస్పూన్ పసుపు
1/4 టీస్పూన్ మిరపకాయలు
1/4 టీస్పూన్ గరం మసాలా
ఉప్పు రుచికి సరిపడా
నూనె వేయడానికి


తయారీ విధానం:
ఈ పాలకూర రోటీని తయారు చేసుకోవడానికి ముందుగా పెద్ద బౌల్‌ తీసుకోవాల్సి ఉంటుంది.
ఆ గిన్నెలో గోధుమ పిండి, ఉప్పు కలపాల్సి ఉంటుంది. ఆ తర్వాత కొద్దిగా కొద్దిగా నీరు పోస్తూ, మృదువైన పిండి లాగా బాగా కలుపుకోవాల్సి ఉంటుంది. 
ఇలా కలుపుకున్న పిండిని 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది. 
ఒక పాన్‌లో నూనె వేడి చేసి, జీలకర్ర వేసి వేయించండి. అల్లం, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ వేసి బంగారు గోధుమ రంగు వచ్చేవరకు వేయించండి.
ఆ తర్వాత అందులోనే పాలకూర వేసి, ఆకులు మెత్తబడే వరకు ఉడికించాలి.
ఆ తర్వాత శనగపిండి, పసుపు, మిరపకాయలు, గరం మసాలా వేసి బాగా కలపాలి. ఉప్పు రుచికి సరిపడా వేసి, మరో 2 నిమిషాలు ఉడికించాలి.


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!
ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని చిన్న ఉండలుగా చేసుకోండి. ఒక ఉండను ఒక పెద్ద రోటీగా చేసుకుని అందులో పాలకూర స్టఫింగ్‌ చేసుకోవాల్సి ఉంటుంది.
ఆ తర్వాత రోటీపై పాలకూర మిశ్రమాన్ని సమానంగా పరిచి తర్వాత రోటీలాగా తయారు చేసుకుని పక్కన పెట్టుకోండి.
ఇలా తయారు చేసుకున్న రోటీలను పెనం పెట్టుకుని బాగా కల్చుకోవాల్సి ఉంటుంది. 


చిట్కాలు:
ఈ రోటీలు మరింత రుచిగా ఉండడానికి పాలకూర మిశ్రమంలో కొన్ని తరిగిన టమోటాలు లేదా క్యారెట్లను వేసుకోవచ్చు.
రోటీలను కాల్చుకునే క్రమంలో నూనెకు బదులుగా నెయ్యి లేదా బట్టర్‌ను వినియోగిస్తే చాలా బాగుంటుంది. 


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి