Pinky Finger in Palmistry: హస్తసాముద్రికంలో అరచేతి రేఖలను చూసి వ్యక్తి స్థితి గతులను చెబుతుంటారు. హస్తసాముద్రికం ప్రకారం ఒక్కో రేఖకు ఒక్కో నిగూఢ అర్థం, సంకేతం ఉంటుంది. ఆ రేఖలు ఎక్కడ ఆగుతున్నాయి.. ఇతర రేఖలతో కలుస్తున్నాయా.. వంటివి కూడా ఇక్కడ కీలకమవుతాయి. అలాగే పింకీ ఫింగర్ (చిటికెన వేలు) పొడవును బట్టి కూడా కొన్ని విషయాలను అంచనా వేయొచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం... 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కేటగిరీ A: 


మీ పింకీ ఫింగర్ పొడవు మీ ఉంగరపు వేలు ఎగువ కట్టు దాకా ఉన్నట్లయితే.. మీరు A కేటగిరీలోకి వస్తారు.


కేటగిరీ 'A'కి చెందినవారు కాస్త రిజర్వ్‌గా ఉంటారు. వీరిని అంతర్ముఖులు అని చెప్పవచ్చు. సన్నిహితులతో కూడా వీరు అంత సులువుగా కలిసిపోలేరు. మొండితనం ఉన్నవారుగా కనిపిస్తారు.


ఈ వ్యక్తులకు మోసం అన్నింటికంటే ఎక్కువ కోపం తెప్పిస్తుంది. అన్ని విషయాల్లో చాలా నిజాయితీగా ఉంటారు. ఇష్టమైన వ్యక్తుల పట్ల ప్రేమపూర్వకంగా ఉంటారు. వారి నుంచి కూడా అదే ప్రేమను ఆశిస్తారు.


కేటగిరీ B: 


మీ పింకీ ఫింగర్ పొడవు మీ ఉంగరపు వేలు ఎగువ కట్టును దాటి ఉన్నట్లయితే.. మీరు B కేటగిరీలోకి వస్తారు.


కేటగిరీ 'B'కి  చెందినవారు సున్నిత మనస్కులు. స్నేహితుల పట్ల అత్యంత విధేయతతో ఉంటారు. వీరికి బాయ్‌ఫ్రెండ్ లేదా గర్ల్‌ఫ్రెండ్ దొరికతే.. ఇక వారే ప్రపంచంగా బతుకుతారు. ఎప్పుడూ వారి ఆలోచనల్లోనే ఉంటారు.


ఎప్పుడూ అందరినీ సంతోషంగా చూడాలనుకుంటారు. 


కేటగిరీ C:


మీ పింకీ ఫింగర్ పొడవు మీ ఉంగరపు వేలు ఎగువ కట్టుకు దిగువగా ఉన్నట్లయితే.. మీరు C కేటగిరీలోకి వస్తారు.


ఈ కేటగిరీకి చెందిన వ్యక్తులు ఎప్పుడూ ఆశాజనకంగా ఉంటారు. నెగటివిటీని దరిచేరనివ్వరు. ఇతరుల తప్పులను సులువుగా క్షమిస్తారు. కొన్నిసార్లు కోపాన్ని అదుపు చేసుకోలేరు.


ఏ విషయంలోనైనా మీ వాదనను బలంగా వినిపించగలరు. అది మీరు విశ్వసించేదైనప్పుడు మీ వాదన మరింత బలంగా వినిపిస్తారు. ఒకవేళ విషయం చాలా దూరం వెళ్తే.. మీరు క్షమాపణ చెప్పేందుకు కూడా ముందుంటారు.


Also Read: Flying Car Video: పక్షిలా గాల్లోకి తుర్రున ఎగిరే కారును ఎప్పుడైనా చూశారా?  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook