COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Papaya Fruit Salad: ఆధునిక జీవనశైలి కారణంగా చాలామందిలో ప్రమాదకరమైన జబ్బులు వస్తున్నాయి ముఖ్యంగా చిన్న వయసులోనే గుండె సమస్యలతో పాటు రోగనిరోధక శక్తి తగ్గి అనేక అనారోగ్య సమస్యలు వారిని పడుతున్నారు అయితే ఇవే కాకుండా కొంతమంది కళ్ళు చర్మం జీర్ణ క్రియ వంటి సమస్యల వారిని కూడా పడుతున్నారు ఇక మరి మరి కొంతమంది అయితే ప్రాణాంతక ఏదైనా క్యాన్సర్ బారిన కూడ పడుతున్నారు. అయితే వీటన్నిటి సమస్యల బారిన పడకుండా ఉండడానికి ప్రతిరోజు ఒక కప్పు బొప్పాయి తినడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు ఇందులో ఉండే గుణాలు అన్ని రకాల వ్యాధుల నుంచి శరీరాన్ని రక్షించడమే కాకుండా శరీరంలోని రోగ నిరోధక శక్తిని పెంచి జీర్ణ క్రియను కూడా ఆరోగ్యంగా చేస్తుంది అంతే కాకుండా క్యాన్సర్ కణాలను నివారించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ప్రతిరోజు తప్పకుండా బొప్పాయి పండు సలాడ్ తినడం చాలా మంచిది.  మీరు కూడా ఇంట్లోనే బొప్పాయి పండు తో సలాడ్ ట్రై చేయాలనుకుంటున్నారా? ఇలా సులభంగా ఇంట్లోనే తయారు చేసుకోండి.


బొప్పాయి పండు సలాడ్ తయారీకి కావలసిన పదార్థాలు:
పక్కిన బొప్పాయి పండు - 1 (తరిగినది)
క్యాబేజీ - 1/2 (తరిగినది)
వెల్లుల్లి - 2 రెబ్బలు (తరిగినవి)
కొత్తిమీర - 1/2 కప్పు (తరిగిన)
పుదీనా - 1/4 కప్పు (తరిగిన)
నిమ్మరసం - 2 టేబుల్ స్పూన్లు
ఆలివ్ నూనె - 1 టేబుల్ స్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
నల్ల మిరియాలు - రుచికి సరిపడా


తయారీ విధానం:
ముందుగా బొప్పాయి సలాడ్ ను తయారు చేసుకోవడానికి ఒక పెద్ద బౌల్ తీసుకోవాల్సి ఉంటుంది.
ఆ తర్వాత బొప్పాయి పండుని తీసుకొని దానిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి.
ఒక గిన్నెలో బొప్పాయి మొక్కలు, క్యాబేజీ, వెల్లుల్లి, కొత్తిమీర, పుదీనా ఆకులు వేసి బాగా మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఆ తర్వాత ఇదే మిక్స్ చేసుకున్న మిశ్రమంలో నిమ్మరసం, ఆలివ్ నూనె, ఉప్పు, నల్ల మిరియాలు కలపండి.
ఇలా అన్ని పదార్థాలు బాగా కలిపిన తర్వాత 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది. 
ఆ తర్వాత రుచి మరింత పెంచుకోవడానికి కావలసినంత నిమ్మరసం వేసుకొని సర్వ్ చేసుకుని తినొచ్చు. 


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!


చిట్కాలు:
ఈ సలాడ్ లో పోషక విలువలు మరింత పెరగడానికి మరికొన్ని పండ్లను లేదా కూరగాయలను కూడా కట్ చేసుకుని వేసుకోవచ్చు. 
ఈ సలాడ్ లో కీరదోసకాయ ను కట్ చేసి వినియోగించడం వల్ల జీర్ణ క్రియ మరింత మెరుగుపడుతుంది. 
ఈ సలాడ్లో చాట్ మసాలా లేదా కారాన్ని కూడా వినియోగించవచ్చు. వీటిని వినియోగించడం వల్ల రుచి మదించ పెరిగే ఛాన్స్ ఉంది.


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి