Pappula Pulusu Recipe: అమ్మలకాలం నాటి పప్పుల పులుసు రెసిపీ..ఇలా 10 నిమిషాల్లో రెడీ చేసుకోండి!
Pappula Pulusu Recipe In Telugu: పప్పుల పులుసును క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అయితే పప్పుల పులుసు తయారు చేయడానికి చాలా మంది ఇబ్బంది పడతారు. అయితే మేము అందించే సులభమైన పద్ధతిలో తయారు చేస్తే రుచికరమైన పప్పులు పొందడం ఖాయం..
Pappula Pulusu Recipe In Telugu: తెలంగాణలో పల్లె ప్రాంతాల్లో బాగా ప్రసిద్ధి చెందిన వంటకాల రెసిపీల్లో పప్పుల పులుసు ఒకటి. ఇది పూర్వీకుల నుంచి వస్తున్న రెసిపీ. ఈ రెసిపీని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల నొటికి రుచి కలగడమే కాకుండా శరీరానికి కూడా చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా కంది పప్పులో ఉండే ఫైబర్ గుణాలు దీర్ఘకాలిక వ్యాధులను తగ్గించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. అయితే చాలా మంది దీనిని తయారు చేయడం చాలా కష్టమనుకుని సాదా పప్పును రెసిపీని తయారు చేసుకుని తీసుకుంటూ ఉంటారు. ఈ సాదా పప్పు తయారి కంటే మేము అందించే పద్దతిలో పప్పులు పులుసును సులభంగా తయారు చేసుకోవచ్చు. ఈ పప్పుల పులుసును ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పప్పుల పులుసుకు కావాల్సిన పదార్థాలు:
1 కప్పు : కంది పప్పు
టమోటాలు: 2-3 మిడిల్ సైజ్
ఉల్లిపాయ: 1, ముక్కలుగా
మునగా: 2 నుంచి 3 చీల్చిన ముక్కలు
వెల్లు: 4-5 రెబ్బెలు
అల్లం: చిన్న ముక్క తురుము
పసుపు: 1/4 స్పూన్
కారం: రుచికి తగినంత
ధనియాల పొడి: 1/2 స్పూన్
జీలకర్ర: 1/2 స్పూన్
మెంతులు: 1/4 స్పూన్
కరివేపాకు: 10-12
నూనె: 2-3 స్పూన్లు
ఉప్పు: రుచికి తగినంత
చింతపండు రసం: 1/2 కప్పు
కొత్తిమీర తురుము: ఒక చిన్న కప్పు
Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?
చేసే విధానం:
ముందుగా ఓ ఖాళీ కప్పు తీసుకుని అందులో కంది పప్పును వేసుకుని 3 నుంచి 4 గంటలు నానబెట్టు.
ఆ తర్వాత కుక్కర్‌లో నూనె వేసి బాగా వేడి చేయాల్సి ఉంటుంది.
అందులో జీలకర్ర, మెంతులు, కరివేపాకు వేసి వేయించుకోవాల్సి ఉంటుంది.
తర్వాత ఉల్లిపాయ ముక్కలు, వెల్లు, అల్లం వేసి వేయించుకోవాలి.
టమోటాలు వేసి కొద్దిగా ఉప్పు వేసి కలర్ మారే వరకు బాగా వేయించాల్సి ఉంటుంది.
ఆ తర్వాత అందులోనే నానించిన పప్పులు, పసుపు, కారం పొడి, ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి.
ఇలా కలిపిన తర్వాత కుక్కర్‌లో 1 కప్పు నీరు, చింతపండు రసం వేసి బాగా కలపి.
కుక్కర్ మూత పెట్టి 3 నుంచి 4 విజిల్స్ వచ్చేవరకు ఉడికించాల్సి ఉంటుంది.
ఆ తర్వాత కొత్తిమీర తురుముతో గార్నిష్ చేసి వేడి వేడిగా వడ్డించుకోండి.
ఈ పప్పును బాగా ఎక్కువ సేపు ఉడికించడం వల్ల పులుసు రుచిగా తయారవుతుంది.
కావాలనుకునేవారు క్యారెట్, బీన్స్ వంటి కూరగాయలు కూడా వేసుకోవచ్చు.
Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter