Periods Symptoms: పీరియడ్స్ వచ్చే ముందు ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్తగా ఉండండి...
Premenstrual Symptoms: నేటి కాలంలో చాలా మంది మహిళలకు పీరియడ్స్ సమయంలో తీవ్రమైన సమస్యలు కలుగుతున్నాయి. ముఖ్యంగా పీరియడ్స్ రెగ్యులర్‌గా రాకపోవడం పెద్ద సమస్యగా మారింది. అయితే పీరియడ్స్ వచ్చే ముందు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. అవి ఏంటో మనం తెలుసుకుందాం.
Premenstrual Symptoms: పీరియడ్స్ మహిళల ఆరోగ్యం గురించి చాలా చెబుతాయి. పీరియడ్స్ అనేవి రెగ్యులర్‌గా రావడం చాలా ముఖ్యం. కొంతమంది మహిళలు పీరియడ్స్ ఎప్పుడు వస్తాయని ఆందోళన చెందుతుంటారు. అయితే పీరియడ్స్ వచ్చే ముందు కొన్ని సంకేతాలు కలుగుతాయని ఆరోగ్యానిపుణులు చెబుతున్నారు. ఈ సంకేతాలను అర్థం చేసుకుంటే ముందుగానే ప్రిపేర్ కావచ్చు. ఈ సంకేతాలను ప్రీ మెనుస్ట్రువల్ లక్షణాలు అని పిలుస్తారు. ఈ లక్షణాలు ఒక్కొక్కరిలో వేరు వేరుగా ఉండవచ్చు. పీరియడ్స్ ముందు కనిపించే లక్షణాలు ఏంటో మనం తెలుసుకుందాం.
సాధారణంగా కనిపించే లక్షణాలు:
ప్రీ మెనుస్ట్రువల్ లక్షణాల్లో మొదట కనిపించే సంకేతాలు చిరాకు, కోపం, విచారం, ఆందోళ, మూడ్ స్వింగ్స్ సాధారణంగా కనిపించే లక్షణాలు. మరి కొంతమంది స్త్రీల్లో తలనొప్పి, వెన్నునొప్పి, కడుపు నొప్పి, వాపు కలుగుతాయి. మరి కొంతమందిలో రొమ్ము సున్నితంగా మారుతుంది. అంతేకాకుండా రొమ్ము బరువుగా, నొప్పిగా ఉంటుంది. ఈ సమయంలో కెఫీన్, చక్కెర పదార్థాలు తీసుకోవడం మంచిది కాదు. మరికొంతమంది ---
అలసట, నిద్రలేమి, ఆకలి పెరగడం లేదా తగ్గడం, మలబద్ధకం లేదా విరేచనం, చికాకు, ఏకాగ్రత సమస్యలు కలుగుతాయి. ఈ లక్షణాలు పీరియడ్స్ వచ్చే ముందు కనిపిస్తాయి.
పీరియడ్స్ వచ్చే ముందు పొత్తికడుపు ఉబ్బినట్టు ఉంటుంది. ఇది ప్రొజెస్టెరాన్, ఈస్ట్రోజన్ హార్మోన్లు అధికంగా విడుదల అవ్వడం కారణంగా ఇలా జరుగుతుందని ఆరోగ్యానిపుణులు చెబుతున్నారు. ఈ సమయంలో శరీరానికి సరిపడ నీటిని తీసుకోవడం మంచిది. దీంతో పాటు కొంత దూరం నడవటం, చిన్న చిన్న పనులు చేయడం చాలా మంచిది. హార్మోన్ల అసమతుల్యత, ముఖ్యంగా ఈస్ట్రోజెన్ స్థాయిలు తగ్గడం వల్ల తలనొప్పి, మైగ్రేన్‌లు తరచుగా వస్తాయి. ఇది పీరియడ్స్‌కు సంకేతం. ఈ సమయంలో ఎక్కువగా ఆల్కహాల్, కెఫీన్ పదార్థాలు తీసుకోకుండా ఉండటం మంచిది. కొన్ని సార్లు హార్మోన్ల్ మార్పు వల్ల చర్మంపై మొటిమలు, మచ్చలు, జిడ్డు వంటి లక్షణాలు కలుగుతాయి. ఈ సమయంలో చక్కెర ఉన్న పదార్థాలు తీసుకోవడం మంచిది కాదు. హార్మోన్ హెచ్చుతగ్గుల వల్ల తగినంత నిద్ర పట్టకుండా ఉంటుంది. ఈ లక్షణం కూడా పీరియడ్స్ కు సంకేతం. కాబట్టి ఈ సమయంలో శరీరానికి కనీసం తొమ్మిది గంటల పాటు నిద్ర చాలా అవసరం. పీరియడ్స్ వచ్చే ముందు తీపి పదార్థాలు తినాలనిపించడం కూడా ఒక లక్షణం. తీపిని ఎక్కువగా తినడం వల్ల నడుము నొప్పి, మలబద్ధకం, అతిసారం వంటి లక్షణాలు కలుగుతాయి.
Disclaimer: ఈ సమాచారం వైద్య సలహాకు బదులు కాదు. ఏదైనా ఆరోగ్య సమస్య గురించి మీ వైద్యుడిని సంప్రదించండి.
Also Read: Weight Loss Upma Recipe: శరీర బరువును తగ్గించే బ్రౌన్ ఉప్మా.. రుచితో పాటు ఆరోగ్యం మీ సొంతం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook