Bhringraj Oil For White Hair Turn Black Naturally In 1 Week: పూర్వీకుల్లో వయసు పెరిగే కొద్ది తెల్ల జుట్టు వచ్చేది. కానీ ఇప్పుడు 20 సంవత్సరాల గల వయసులో కూడా తెల్ల జుట్టు సమస్యలు వస్తున్నాయి. ఇలాంటి సమస్యలు రావడానికి ప్రధాన కారణాలు..అతిగా రసాయనాలు కలిగిన ప్రోడక్ట్స్‌ వినియోగించడం, అనారోగ్యకరమైన ఆహారాలు అతిగా తినడం తెల్ల జుట్టు వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ తెల్ల జుట్టు సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు ఆయుర్వేద నిపుణులు సూచించిన భృంగరాజ్ మూలికతో తయారు చేసిన నూనెను వినియోగించాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు తెల్ల జుట్టును నల్లగా చేయడమే కాకుండా జుట్టు రాలడాన్ని తగ్గిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఈ ఆయుర్వేద గుణాలు కలిగిన నూనెను ఎలా తయారు చేసుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెల్ల జుట్టుకు బృంగరాజ్‌ను ఎలా వినియోగించాలో తెలుసా?:
తెల్ల జుట్టు శాశ్వతంగా నల్లగా మారడానికి తప్పకుండా బృంగరాజ్‌తో తయారు చేసిన నూనెను క్రమం తప్పకుండా వినియోగించాల్సి ఉంటుంది. దీనికోసం ముందుగా ఈ నూనెను తీసుకుని జుట్టుకు బాగా అప్లై చేసి నాలుగు నిమిషాల పాటు మసాజ్‌ చేయాలి. ఇలా చేసిన తర్వాత గంటసేపు జుట్టుకు రెస్ట్‌ ఇచ్చి ఆయుర్వేద గుణాలు కలిగిన షాంపుతో శుభ్రం చేయాల్సి ఉంటుంది. 


Also Read: Benefits of Drumsticks: మునగకాయతో నమ్మలేని ప్రయోజనాలు.. తెలిస్తే షాక్ అవుతారు!


బృంగరాజ్ ఆకులను కూడా తెల్ల జుట్టుకు వినియోగించవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఈ ఆకులను వినియోగించే ముందు వీటిని బాగా ఎండబెట్టాల్సి ఉంటుంది. ఆ తర్వాత పొడిలా తయారు చేసుకుని అందులో నీటిని కలిపి మిశ్రమంలా తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న తర్వాత తెల్ల జుట్టుకు అప్లై చేయాలి. అప్లై చేసి రెండు గంటలు అలాగే ఉంచి షాంపూ శుభ్రం చేసుకోవాలి. 


భృంగరాజ్ నూనె తయారి పద్దతి:


ఇంట్లోనే భృంగరాజ్ నూనెను తయారు చేసుకుని వినియోగించవచ్చు. దీని కోసం ముందుగా ఓ చిన్న బౌల్‌ తీసుకుని అందులో  నువ్వుల నూనెలో కొన్ని బృంగరాజ్ ఆకులను వేసి బాగా మరిగించుకోవాలి. ఇలా 5 నిమిషాల పాటు మరిగిన తర్వాత ఫిల్టర్‌ చేసి గాజు సీసాలో భద్రపరుచుకుని మీకు కావాల్సిప్పుడు వినియోగించుకోవచ్చు. 


Also Read: Benefits of Cabbage: ఈ వ్యాధులు రాకుండా ఉండాలంటే క్యాబేజీని డైట్ లో చేర్చుకోండి...



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook