Pickles Side Effects: వేసవికాలం వెళ్తూ వెళ్తూ..రుచికరమైన పచ్చళ్లు ఇచ్చిపోతుంటుంది. ప్రతి వేసవికి ఇళ్లలో ఇష్టంగా వేసుకునే వివిధ రకాల పచ్చళ్లు నోరూరిస్తుంటాయి. రుచిగా ఉందని అతిగా లాగించేస్తే..మగవారికి ముప్పేనట. ఆ వివరాలేంటో తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తినే ఆహార పదార్ధాలకు రుచిని అందించేది పచ్చళ్లు. దక్షిణాదిన ప్రతి వేసవిలో వేసుకునే పచ్చళ్లు ఏడాదంతా ఉంటాయి. ప్రతి వేసవి వెళ్తూ వెళ్తూ ఇష్టమైన పచ్చళ్లను ఇచ్చిపోతుంటుంది. జిహ్వకు రుచినిచ్చేవి ఈ పచ్చళ్లే. వేడి వేడి అన్నంలో..పచ్చడి వేసుకుని తింటే వచ్చే రుచే వేరు. అందుకే అందరూ పచ్చళ్లంటే అంతగా పడి ఛస్తారు. కానీ రుచిగా ఉందని అతిగా లాగిస్తే...మహిళల కంటే మగవాళ్లకు ఎక్కువ ముప్పుంటుందని మీకు తెలుసా. ఆశ్చర్యపోతున్నారా..నిజమే ఇది. 


ఇంట్లో భోజనమైనా, అల్పాహారమైనా, స్నాక్స్ అయినా పచ్చళ్లతో తింటే ఆ రుచే వేరు. తినే తిండి రుచిని నాలుగు రెట్లు పెంచుతాయి. కొంతమందైతే రుచిగా ఉందని అతిగా లాగిస్తుంటారు. పచ్చళ్లు అతిగా తింటే అనర్దాలు ఎక్కువంటున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా మగవారు కాస్త పరిమితంగానే తినాల్సి ఉంటుంది. లేకపోతే ముప్పు ఎక్కువే.


గ్యాస్ట్రిక్ కేన్సర్


పచ్చళ్లపై జరిపిన వేర్వేరు అధ్యయనాలు ఇదే చెబుతున్నాయి. పచ్చళ్లు అతిగా తింటే గ్యాస్ట్రిక్ కేన్సర్ ముప్పు పొంచి ఉంటుందట. మరోవైపు ఉప్పు ఎక్కువగా ఉంటుంది కాబట్టి..అధిక రక్తపోటు సమస్య తలెత్తుతుంది. బీపీ పేషెంట్లకు ప్రమాదకరమిది. హైపర్ టెన్షన్ రోగులకు కూడా ప్రమాదకరమే. ముఖ్యంగా మార్కెట్‌లో కొనుగోలు చేసే పచ్చళ్లలో ప్రిజర్వేటివ్స్ అధికంగా ఉంటాయి. దాంతో పాటు అందులో అసొటామిప్రిడ్ ఎక్కువ మోతాదులో ఉంటుంది. ఇది ఆరోగ్యానికి హాని కల్గిస్తుంది. అసొటామిప్రిడ్ అనేది ఒక కర్బన పదార్ధం. ఇది లైంగిక జీవితంలో ఇబ్బంది కల్గిస్తుంది. అందుకే పచ్చళ్లు ఎప్పుడూ అతిగా తీసుకోకూడదు. 


కొలెస్ట్రాల్ పెరుగుతుంది


సాధ్యమైనంతవరకూ ఇంట్లో చేసిన పచ్చళ్లను..అది కూడా పరిమితంగానే తీసుకోవడం మంచిది. ఎందుకంటే మార్కెట్‌లో లభించే పచ్చళ్లకు రుచి కోసం నూనె, మసాలా ఎక్కువగా వాడుతారు. ఇవి ఆరోగ్యానికి హాని చేకూరుస్తాయి. పచ్చళ్లలో ఆయిల్ ఎక్కువగా ఉండటం వల్ల..మసాలా పదార్ధాల కారణంగా..కొలెస్ట్రాల్ ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.


Also read: Amla Juice Benefits: ఎవర్ ఫిట్ అండ్ స్లిమ్ కావాలంటే..రోజూ ఉసిరి జ్యూస్ తాగితే చాలు



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి


Android Link https://bit.ly/3hDyh4G


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook