How To Remove Pigmentation From Face Permanently At Home Naturally: ప్రస్తుతం చాలా మందిలో చెమట కారణంగా చర్మం టాన్‌గా మారుతోంది. మరికొందరిలో ముఖంపై మొటిమలు, మచ్చలు వస్తున్నాయి. దీని కారణంగా తీవ్ర చర్మ సమస్యలు రావడమేకాకుండా చర్మం అందహీనంగా తయారవుతోంది. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఇప్పటికే ముఖంపై చిన్న చిన్న మచ్చలు ఉన్నవారు తప్పకుండా పలు రకాల హోం రెమెడీస్‌ని వినియోగించాల్సి ఉంటుంది.  ముఖంపై మచ్చలు, మొటిమలు తగ్గడానికి ఎలాంటి చిట్కాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హోం రెమెడీకి కావాల్సిన పదార్థాలు:
❉ 3 టీస్పూన్ల  తేనె 
❉ 3 చుక్కల గ్లిజరిన్ 
❉ 1 గ్రీన్ టీ బ్యాగ్ 


మచ్చలను తొలగించే క్రీమ్‌ను ఇలా తయారు చేసుకోండి:
మచ్చల కోసం క్రీమ్‌ తయారు చేయడానికి ముందుగా ఒక చిన్న గిన్నెను తీసుకోవాల్సి ఉంటుంది. 
ఈ గిన్నెలతో 3 చెంచాల తేనె, 3 చుక్కల గ్లిజరిన్ వేసుకుని వీటిని రెండింటినీ బాగా మిక్స్‌ చేయాలి.
ఆ తర్వాత గ్రీన్ టీ బ్యాగ్‌ని తెరిచి ఒక టీస్పూన్‌ నీటిలో కలుపుకోవాలి. 
ఇలా టీస్పూన్‌ కలిపిన గ్రీన్ టీ బ్యాగ్‌లను రెండు వేసి కలిపిన మిశ్రమంలోనే వేసుకుని బాగా కలుపుకోవాలి.
అన్ని పదార్థాలను ఫైన్‌గా మిశ్రమంలా తయారు చేసుకోవాలి.


Also Read: Congress: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌కు బూస్ట్.. సచిన్ పైలట్ కీలక ప్రకటన  


వినియోగించే పద్ధతి:
మీకు కూడా చిన్న చిన్న మచ్చల సమస్యలు ఉంటే తప్పకుండా ఈ మిశ్రమాన్ని వినియోగించాల్సి ఉంటుంది.
ఈ మిశ్రమాన్ని అప్లై చేసుకోవడానికి ముందుగా ఫేస్‌ను బాగా శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది.
సిద్ధం చేసుకున్న మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయాలి.
ఆ తర్వాత 20 నిమిషాల పాటు పేస్ట్ అలాగే ఉంచి..మంచి నీటితో శుభ్రం చేయాలి.
ఇలా క్రమం తప్పకుండా ముఖానికి అప్లై చేస్తే తొందరలోనే మంచి ఫలితాలు పొందుతారు. 


(నోట్‌: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)


Also Read: Congress: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌కు బూస్ట్.. సచిన్ పైలట్ కీలక ప్రకటన  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook