Pimples Home Remedies: ముఖంపై మొటిమలు, మచ్చలు వంటి సమస్యలతో బాధపడుతున్నవారు చాలా మంది ఉన్నారు. వారి ముఖ్యంగా యువత ఎక్కువగా బాధపడుతున్నారు. అయితే మొటిమలు రావడానికి కారణం హార్మోన్ల అస‌మ‌తుల్య‌త‌, జిడ్డు చ‌ర్మం, ర‌సాయనాలు క‌లిగిన లోష‌న్ ల‌ను, క్రీముల‌ను వాడ‌డం, మారిన ఆహార‌పు అల‌వాట్లు అని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మొటిమలు వచ్చినప్పుడు చాలా క్రీములు వాడుతూంటారు. కొంతమంది గిల్లుతూ ఉంటారు. కానీ మొటిమ‌ల‌ను గిల్ల‌కూడ‌దు. మొటిమ‌ల‌ను గిల్ల‌డం వ‌ల్ల ఆ భాగంలో మ‌చ్చ‌లు, గుంత‌లు ఏర్ప‌డ‌తాయి. 


మొటిమ‌ల‌తో బాధ‌ప‌డే వారు ముఖానికి తేనెను రాసుకోవాలి. దీని వల్ల మొటిమల నుంచి ఉపశమనం లభిస్తుంది. దీని వల్ల ఇన్‌ప్లామేషన్‌ తగ్గుతుంది. మచ్చలు కూడా తొలగిపోతాయి. 


మొటిమ‌ల‌తో బాధ‌ప‌డే వారు ముఖానికి మ‌డ్ ప్యాక్ వేసుకోవాలి. న‌ల్ల‌టి మెత్త‌టి మ‌ట్టిని తీసుకుని నీటిలో  నానబెట్టాలి. త‌రువాత ఈ మ‌ట్టిని తీసుకుని ముఖానికి రాసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల వ్య‌ర్థాలు తొల‌గిపోతాయి. చ‌ర్మ క‌ణాలు ఆరోగ్యంగా త‌యార‌వుతాయి.


ప్రతిరోజు ఐదు లీట‌ర్ల నీటిని తాగాలి. ఇలా తాగ‌డం వ‌ల్ల వ్య‌ర్థాలు తొల‌గిపోతాయి. శ‌రీరంలో వ్య‌ర్థాలు ఎక్కువ‌గా పేరుకుపోవ‌డం వల్ల కూడా మొటిమ‌ల స‌మ‌స్య త‌లెత్తుతుంది. 


ఉద‌యం పూట వెజిటేబుల్ జ్యూస్ ను తీసుకోవాలి. సాయంత్రం విట‌మిన్ సి ఎక్కువ‌గా ఉండే క‌మలా పండ్ల జ్యూస్, బ‌త్తాయి జ్యూస్ వంటి వాటిని తీసుకోవాలి.


 ఈ విధంగా ఈ చిట్కాల‌ను పాటించ‌డం వ‌ల్ల మొటిమ‌లు త‌గ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి మొటిలు వచ్చినప్పుడు ఈ టిప్స్‌ పాటించడం చాలా అవసరం. 


Also Read : Jio Bharat b2: 343 గంటల స్టాండ్‌బై బ్యాటరీతో మార్కెట్‌లోకి Jio Bharat B2 మొబైల్‌..ఫీచర్స్‌, ధర వివరాలు!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter