Plant Leaves turning yellow:  వేసవిలో మనుషులతో పాటు మొక్కలు కూడా పాలిపోతుంటాయి. దీంతో ఆకులు పచ్చ రంగులోకి మారిపోతాయి అవి వాడిపోతాయి. ఒక్కోసారి నేను మొక్కలకు నీరు పోసినా కూడా ఇలా జరుగుతుంది. దానికి కారణాలు ఏంటి దీని ఎలా అధిగమించాలో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మొక్కల ఆకులు పచ్చ రంగులోకి మారడానికి కారణాలు..
అతిగా నీరు పోయడం, నీళ్లు తక్కువగా పోయడం, మట్టిలో ఉప్పు చేరడం, కీటకాలు పట్టడం వంటివి మొక్కలు పచ్చ, బ్రౌన్‌ రంగులోకి మారడానికి ప్రధాన కారణం.


ఈ జాగ్రత్తలు తీసుకోండి..
ఇలా మొక్కల ఆకులు పచ్చ రంగులోకి మారిపోవడానికి ఎండలు ఎక్కువగా ఉండటం ఒక కారణమవుతే ఒక్కోసారి ఇందులో కీటకాలు చేయడం కూడా జరుగుతుంది. దీనికి మంన ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.


ఉదయమే నీళ్లు పోయండి..
మొక్కల ఆకులు ఇలా పసుపు రంగులోకి మారిపోకుండా ఉండాలంటే ఉదయమే సూర్యుడు రాకముందు మొక్కలకు నీళ్లు పోయండి. అప్పుడే వేడి తక్కువగా ఉండటం వల్ల వరకు నీళ్లు చేరుతాయి ఒకవేళ మీరు మధ్యాహ్నం సమయంలో నీళ్లు పోస్తే త్వరగా నీరు ఆవిరైపోతాయి. దీంతో మట్టి లోపలికి నీళ్లు చేరవు. ఇలా చేయడం వల్ల కూడా మొక్కలు ఆకులు పచ్చగా మారిపోతాయి.


చల్లగా..
అంతేకాదు ఏ ముక్కలు అయినా కానీ భానుడి ప్రతాపాన్ని తట్టుకోలేవు. అతిగా ఎండ ఉన్న ప్రాంతంలో మధ్యాహ్నం సమయంలో మొక్కలు అలా వదిలేయకండి. తాత్కాలికంగా ఏదైనా షెడ్ లేకపోతే ఏదైనా కవర్ మొక్కలపై బాగానే కప్పి ఉంచాలి. లేకపోతే డైరెక్ట్ సూర్యరశ్మి నుంచి పక్కకు నీడలో తీసి పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల మొక్కలు ఆకులు త్వరగా వాడిపోవు.


ఇదీ చదవండి: మలబద్ధకాన్ని జాడించి తన్నే అద్భుత ఔషధం ఈ ఒక్క రసం..!


సూర్య రశ్మి..
ఆ మొక్కలకు సూర్యరశ్మి తగలకుండా ఒక కవర్ లాంటిది మొక్కల పై భాగంలో ఏర్పాటు చేసుకోవాలి. కొన్ని రకాల విండోస్ కవర్స్ ఏర్పాటు చేసుకుంటే డైరెక్ట్‌గా ఎండలు మొక్కలపై పడకుండా ఉంటుంది. ఎండ ప్రభావం ఎక్కువగా ఉండదు. మొక్కల ఆకులు పచ్చగానే ఉంటాయి.


మందులు వేయకండి..
ఈ మండే ఎండలో మొక్కలకు ఏ మందులు వాడకూడదు. మొక్కలను కూడా ఈ సమయంలో తరచుగా వేరే ప్లాంట్ లోకి మార్చినప్పుడు అది త్వరగా ఖనిజాలను గ్రహించలేదు. అందుకే ఎండాకాలం సమయంలో మొక్కలను వేరే కుండీలోకి మార్చకండి. ఫర్టిలైజర్లు అతిగా ఉపయోగించకూడదు.


ఇదీ చదవండి: డ్రైఫ్రూట్స్‌ లడ్డూ.. రుచికరం ఎంతో ఆరోగ్యకరం ఇలా తయారు చేసుకోండి..


నో ప్రూనింగ్..
ఈ మండు వేసవిలో మొక్కల కాడలను కోయకుండా జాగ్రత్తగా చూసుకోండి. అంటే ప్రూనింగ్ చేయకూడదు. దీనివల్ల మొక్క త్వరగా పాడవుతుంది. వాతావరణం కాస్త చల్లగా మారినప్పుడు ప్రూన్‌ చేయాలి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )

 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి