Thyroid Post Pregnancy: థైరాయిడ్ పోస్ట్ ప్రెగ్నెన్సీ అనేది ఒక సాధారణ వ్యాధి. ఇది  గర్భధారణ తర్వాత మహిళల్లో థైరాయిడ్ సమస్యలు కొంతమేరకు సర్వసాధారణం. గర్భధారణ సమయంలో హార్మోన్లలో కలిగే మార్పులు గర్భధారణ తర్వాత కూడా కొంతకాలం కొనసాగుతాయి. ఇది థైరాయిడ్ గ్రంథి పనితీరును ప్రభావితం చేయవచ్చు.
 
థైరాయిడ్ పోస్ట్‌ ప్రెగ్నెన్సీ లక్షణాలు:


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చిన్న చిన్న పనులకు అలసిపోవడం అనేది మొదటి లక్షణం, కొంతమందిలో బరువు తగ్గడం లేద పెరగడం కనిపిస్తుంది. చల్లికి అతి సున్నితంగా ఉండటం లేదా జుట్టు ఎక్కువగా రాలడం వంటి సమస్యలు కూడా దీని లక్షణాలే.  మరి కొంతమందిలో చర్మం పొడిబారడం. మానసిక స్థితిలో కొన్ని మార్పులు రావడం ఉంటుంది.  తరుచు కీళ్ళ నొప్పులు, కండరాలు పట్టేయడం, అస్తవ్యస్తమైన గుండె స్పందన ఉండటం కూడా దీని లక్షణాలు అని చెప్పవచ్చు. 


థైరాయిడ్ పోస్ట్‌ ప్రెగ్నెన్సీ గల కరాణాలు:


గర్భధారణ సమయంలో థైరాయిడ్ గ్రంథి పెరిగి ఉండటం వల్ల ఈ సమస్య కలుగుతుందని వైద్యులు చెబుతున్నారు. మరికొంతమందిలో హైపోథైరాయిడిజం పెరగడం లేదా తగ్గడం వల్ల ఈ సమస్య రావచ్చు. లేదా శరీరంలో ఆటో ఇమ్యూన్‌ వ్యాధుల వల్ల ఈ లక్షణాలు కలుగుతాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. 


అయితే నిపుణులు ప్రకారం గర్భధారణ తర్వాత థైరాయిడ్‌ సమస్యలు ఉన్నాయా లేదా అని తెలుసుకోవడం చాలా ముఖ్యం అని చెబుతున్నారు, దీని కోసం రక్తపరీక్షలు, అల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌ వంటి చికిత్సలు చేసుకోవడం చాలా మంచిది. అలాగే ఆరోగ్యకరమైన ఆహారపదార్థాలు తీసుకోవడం ముఖ్యం. దీంతో పాటు వ్యాయామం, తగిన విశ్రాంతి ఉండాలి.  


థైరాయిడ్‌కు మంచి ఆహారాలు:


థైరాయిడ్ పోస్ట్‌ ప్రెగ్నెన్సీ సమస్య బారిన పడకుండా ఉండాలంటే లేదా ఉన్నవారు ముఖ్యంగా ఈ ఆహారపదార్థాలు తీసుకోవాల్సి ఉంటుంది. వీటిని ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల ఎలాంటి నష్టాలు కలగకుండా ఉంటుంది. మీ ఆహారంలో అయోడిన్‌ ఎక్కువగా ఉన్న పదార్థాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇవి థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తికి చాలా ముఖ్యమైన ఖనిజం. ఇది సముద్రపు ఆహారం (చింతపిచి, రొయ్యలు), అయోడిన్ ఉప్పు, పాల ఉత్పత్తులు, గుడ్లు మొదలైన వాటిలో లభిస్తుంది.


అలాగే ప్రోటన్‌ కంటెంట్‌ ఉన్న పదార్థాలు తీసుకోవాలి. ఇందులో ఉండే పోషకాలు శరీరానికి మేలు చేస్తాయి. ప్రోటీన్‌ ఎక్కువగా  మాంసం, చేప, కోడిగుడ్లు, పప్పులు, బీన్స్ వంటి శరీరానికి సహాయపడతాయి. వీటితో పాటు విటమిన్ డి, విటమిన్ బి12, ఐరన్‌, జింక్ వంటి విటమిన్లు  ఖనిజాలు థైరాయిడ్ ఆరోగ్యానికి చాలా ముఖ్యం. ఈ పోషకాలు పచ్చని ఆకు కూరలు, కాయగూరలు, పండ్లు, గింజలు, విత్తనాలు మొదలైన వాటిలో లభిస్తాయి. కొంతమంది వ్యక్తులలో గ్లూటెన్ థైరాయిడ్ సమస్యలను తీవ్రతరం చేస్తుంది. కాబట్టి, గోధుమ, బార్లీ, రై మొదలైన గ్లూటెన్ ఉన్న ఆహారాలను నివారించడం మంచిది.  ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది  శరీరంలోని విషాన్ని తొలగించడానికి సహాయపడుతుంది. ఇది పండ్లు, కూరగాయలు, గింజలు, విత్తనాలు మొదలైన వాటిలో లభిస్తుంది.


ఇది కూడా చదవండి: Ulli Masala: ఇంట్లో ఏమి కూర చేయాలో తోచనపుడు ఇలా ఉల్లి మసాలా కూర చేసుకోండి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.